Wanaparthy District : మరో ఇద్దరు అవినీతి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ (ACB) అధికారులకు చిక్కారు. వనపర్తి జిల్లా (Wanaparthy) కొత్తకోట మండలం నీర్వేన్ గ్రామానికి చెందిన ఓ రైతు ఇనాం భూముల ఓఆర్సీ కోసం ఆర్డీవో (RDO)కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని ఆర్డీఓ కొత్తకోట ఎమ్మార్వోకు పంపారు. దీంతో తహసీల్దార్ ఇనాం భూములకు సంబంధించిన వివరాలను ఇవ్వాలని ఎమ్మారై వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు వీరిద్దరు సదరు రైతు నుంచి రూ.40 వేలు ఇస్తేనే పనిచేసి పెడతామని చెప్పారు. సదరు రైతు అంతపెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వలేని మొరపెట్టుకున్నా వారు వినలేదు.దీంతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం కోసం ఎంఆర్ఐ వాసు, డిప్యూటీ సర్వేయర్ నవీన్ రెడ్డి డిమాండ్ చేసినట్లు ఆధారాలను సేకరించి మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం లింగస్వామి, జిలాని, కిషన్ నాయక్, తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఇద్దరు అధికారులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వీరిని కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు డీఎస్పీ బాలకృష్ణ వెల్లడించారు.
లంచం అడిగితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి “టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయాలని ఏసీబీ అధికారులు కోరారు. అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన “వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    