- రవాణా శాఖ డిటిసి పై ఏసీబీ దాడులు
- ఏకకాలంలో 3 చోట్ల సోదాలు చేస్తున్నట్లు ప్రచారం..?
ACB Raids | తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు యమ స్పీడు మీద ఉన్నారు. చిన్న క్లూ దొరికితే చాలు అక్రమారుల భరతం పడుతున్నారు. ఇటీవలి కాలంలో వరుస దాడులతో అవినీతి అధికారుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. రవాణా శాఖలో ఇప్పటికే పలుమార్లు అనేక జిల్లాల్లో దాడులు చేసి కొంతమంది అవినీతి అధికారులను జైలుకు పంపించిన అధికారులు.. ఈరోజు ఉదయమే హన్మకొండలోని రవాణా శాఖ (RTA)లోని డిప్యూటీ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ (DTC) పుప్పాల శ్రీనివాస్ కు చెందిన ఇళ్ళల్లో సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్, జగిత్యాల హన్మకొండ లోని ఆయనకు చెందిన ఇండ్లలో ఏకకాలంలో మెరుపుదాడులు చేశారు.
కాగా ఇప్పటికే పుప్పాల శ్రీనివాస్ పై అవినీతి ఆరోపణలు అనేకం ఉన్నాయి. రవాణా శాఖ లో డిటిసి స్థాయి అధికారిపై ఏసీబీ రైడ్స్ జరగడం రాష్ట్రంలో చర్చనీయాంశం కాగా.. రవాణా శాఖలో మాత్రం కలకలం రేపుతోంది.
ACB Raids : ఏసీబీ వలలో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులు
గత కొంతకాలంగా ఏసిబి తన దూకుడు పెంచింది. 2024 సంవత్సరంలో ఏసీబీ మొత్తం 152 కేసులు నమోదు చేసింది. లంచాలు తీసుకుంట పట్టుబడిన 223 మంది నిందితులను అరెస్టు చేసింది. వీటిలో 129 ట్రాప్ కేసులు 200 మంది నిందితులను అదుపులోకి తీసుకోగా వారిలో 159 ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 2024లో నమోదు చేసిన 129 ట్రాప్ కేసుల్లో తెలంగాణ ఏసీబీ మొత్తం రూ.82 లక్షల పైగా నగదును స్వాధీనం చేసుకుంది. పట్టుకున్న నగదులో రూ.64లక్షలు ఫిర్యాదుదారు చేసినవారికి తిరిగి చెల్లించింది. 11 కేసుల్లో ఏకంగా రూ.97 కోట్ల విలువైన అక్రమాస్తులను నిందితుల ఆస్తులకు అటాచ్ చేశారు.
ఇక 2025 జనవరిలో అవినీతి నిరోధక శాఖ మొత్తం 19 కేసులను నమోదు చేసింది. అందులో 17 మంది ప్రభుత్వ ఉద్యోగులు వివిధ నేరారోపణలతో పట్టుబడ్డారు. వీరిలో ఇద్దరూ పోలీస్ శాఖకు చెందిన వారు కూడా ఉన్నారు. వివిధ శాఖల ట్రాప్ కేసుల్లో రూ.1.45 లక్షల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు ఏసిబి అధికారులు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] రోడ్డులో ఉన్న ఆయన నివాసంతోపాటు మహబూబాబాద్, జమ్మికుంట, హైదరాబాద్లోని ఆయన […]