కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ తుది దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే కీలక ఘటన చోటుచేసుకుంది. శనివారం ఉదయం కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఎన్‌సీగా ఉన్న హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు (ACB Officials) ఎన్‌డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ షేక్‌పేట్ (Shaikpet) లోని ఆదిత్య టవర్స్ లో ఉన్న హరిరామ్ నివాసంతో పాటు మొత్తం 14 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం హరిరామ్ కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా, గజ్వేల్ (Gajwel) ప్రాంత ఈఎన్సీగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాళేశ్వరం అనుమతులు, డిజైన్లు, రుణాల సమీకరణలోనూ ఆయన అత్యంత కీలకంగా వ్యహరించారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటి పారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్‌సీగా ఉన్న ఆమె ప్రస్తుతం వాలంటరీ డైరెక్టర్ జనరల్ (Voluntary Director General) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సోదాల్లో భాగంగా హరిరామ్ పేరిట భారీగా ఆస్తుల ఉన్నట్లుగా ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. గజ్వేల్‌లో 30 ఎకరాల భూమి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు 3 బ్యాంక్ లాకర్లు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








