ACB | తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆర్టీఏ చెక్ పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఏసిబి అధికారులు చేసిన తనిఖీల్లో పలు చెక్ పోస్టుల్లో లెక్కల్లో చూపని సొమ్ము బయటపడింది. ఆదిలాబాద్‌లోని భోరజ్ చెక్‌పోస్టు, నల్గొండలోని చెక్‌పోస్టు, అలంపూర్ చెక్‌పోస్టుల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు చేశారు.
కాగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఆకస్మిక దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ అధికారుల బృందాలు సీజ్ చేసినట్లు సమాచారం. నల్గొండ జిల్లా విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,600, భోరజ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, (గద్వాల్) అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
One thought on “ACB | రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ మెరుపు దాడులు”