ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ
ACB Raids : రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ముమ్మరంగా సోదాలు (ACB Raids) చేస్తున్నారు.
హైదరాబాద్ మలక్‌పేట్‌లో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) నూనె శ్రీధర్ (Nune Sridhar) ఇంట్లో
బుధవారం ఏసీబీ అధికారులు (ACB Officers) . తనిఖీలు చేస్తున్నారు. ఏకకాలంలో శ్రీధర్‌కు సంబంధించిన 20 ప్రాంతాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తున్నది. ఏసీబీ అధికారులు శ్రీధర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) లో శ్రీధర్ విధులు నిర్వర్తించారు. అయితే నూనె శ్రీధర్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు (Irrigation Engineer Corruption) ను ఏసీబీ అధికారులు ఫైల్ చేశారు. పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఏసీబీ దాడులు ఎక్కడ జరిగాయి?
Telangana Irrigation Engineer Corruption : కాగా కరీంనగర్ (Karimnagar) లో శ్రీధర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు. ఏసీబీ సోదాల్లో శ్రీధర్ ఆస్తుల చిట్టా మొత్తం వెలుగులోకి వస్తోంది. శ్రీధర్‌కు సంబంధించిన 20 ప్రాంతాల్లో ఏసీబీ ఏకకాలంలో తనిఖీలు చేస్తున్నది. మార్చి 2న ఓ ఫామ్ హౌస్‌లో శ్రీధర్ తన కుమారుడి హల్దీ, సంగీత్ ఫంక్షన్లను అంగరంగ వైభవంగా జరిపించారు. మార్చి 6న థాయిలాండ్‌లో కొడుకు వివాహ వేడుకలు నిర్వహించారు. ఇక మార్చి 9న నాగోల్‌లోని శివం కన్వెన్షన్ హాల్‌లో ఎంతో వైభవంగా రిసెప్షన్‌ను చేసినట్లు తెలుస్తోంది. శ్రీధర్ కూడబెట్టిన ఆస్తులపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    