హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్ లోని పది చోట్ల ఏకాలంలో సోదాలు..
Hydrabad : నీటి పారుదల శాఖ మాజీ చీఫ్ ఇంజినీర్ మురళీధర్‌రావు (Muralidar Rao) ఇంట్లో ఏసీబీ ఆకస్మికంగా సోదాలు (ACB Rids) చేపట్టింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో ఏసీబీ ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు మురళీధర్ రావుపై పలు ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, జహీరాబాద్.. మొత్తం 10 చోట్ల ఏకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
ఈఎన్‌సీ జనరల్ (ENC General) గా కీలకంగా వ్యవహరించిన మురళీధర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేవ్ రాష్ట్రంలోనే పదవీవిరమణ పొందారు. ఆ తర్వాత ముళీధర్‌రావు పదవీ కాలాన్ని 13 సంవత్సరాల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆయన కొన్నాళ్లు పదవిలో ఉన్నారు. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్‌రావును ప్రభుత్వం పక్కనబెట్టింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.