ఏసీబీకి ఐదు రోజుల కస్టడీ
ACB | కాళేశ్వరం లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అవకతవకల కేసులో చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఈఎన్‌సి భూక్యా హరిరామ్ (Hariram)ను ఏసీబీ 5 రోజుల కస్టడీకి తీసుకుంది. ఈనెల 6 వరకు హరిరామ్‌ను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ ఈఎన్‌సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిసిన అనంతరం ఆయనను పోలీసులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. విచారణ జరిపిన న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు.
ACB Raids : సుమారు 200కోట్లకు పైగా అక్రమ ఆస్తులు?
మాజీ ఈఎన్‌సి హరిరామ్ సుమారు రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు కలిగి ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. హరిరామ్ ఇంటితోపాటు బంధువుల ఇళ్లల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో 14 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. గజ్వేల్‌లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు తేల్చారు. మార్కుర్‌లో 28 ఎకరాల భూమి, కొండాపూర్ షేక్స్‌పేట్, శ్రీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, ఆరెకరాల మామిడి తోట, ఫామ్ హౌస్‌ను గుర్తించారు.
కాళేశ్వరం వ్యవహారంలో అవినీతి ?
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ల మార్పు వ్యవహారంలో భారీ స్ధాయిలో అవినీతి జరిగిందని, ఇందులో హరిరామ్ కీలకపాత్ర షోషించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు , కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ నివేదిక ఇటీవల వెలువడింది. ఈ నేపథ్యంలో హరిరామ్ ఇల్లు, జలసౌధ కార్యాలయం, హరిరామ్ బంధువులు, స్నేహితులకు సంబంధించిన ఇళ్లు సహా 14 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఈ తనిఖీల్లో ఏసీబీ (ACB) అధికారులు కళ్లుచెదిరే ఆస్తులను గుర్తించారు. ఏసీబీ ప్రకటన ప్రకారం.. హరిరామ్‌కు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్ ఉన్న మర్కూక్ మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అలాగే, ఆంధప్రదేశ్ రాజధాని అమరావతిలో వాణిజ్య స్థలం ఉంది. అంతేకాక, హైదరాబాద్‌లోని షేక్‌పేట్, కొండాపూర్‌లో విల్లాలు, మాదాపూర్, శ్రీనగర్‌కాలనీ, నార్సింగ్‌లో ఫ్లాట్లు- ఉన్నాయి. పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో రెండు ఇండిపెండెంట్ ఇళ్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








