Accident in Mahabubabad : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట గ్రామంలోని పెద్దనగరం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మహిళలు గాయపడగా, వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇతరులకు స్వల్పంగానే కానీ రక్తస్రావంతో కూడిన గాయాలు అయ్యాయి. బాధితులందరూ రోజువారీ కూలీ కార్మికులు, చెర్లపాలెం మరియు ఫతేపురం గ్రామాలకు చెందినవారు.. మిర్చి కోత పనికి ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్నారు.
పదిహేడు మంది కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం (Tragic incident) చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే పోలీసులు అంబులెన్స్ లలో మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్ (Mahabubabad Area Hospital) కు తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు ఎక్కువగా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. మిర్చి తోటలో మిర్చి ఏరడానికి బంగ్లా వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. మానుకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








