Adani’s indictment : భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనే ఆరోపణలు మళ్లీ హాట్‌టాపిగ్‌గా మారాయి. సౌరశక్తి ఒప్పందాల కోసం భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ కంపెనీస్ ముడుపులు ముట్టజెప్పిందని, వాటి చెల్లింపులు అమెరికా పెట్టబడిదారుల నుంచి జరగాయని అభియోగాలు ఉన్నాయి. తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. అమెరికా అటార్నీ జనరల్ (Attorney General)గా బాధ్యతలు స్వీకరించిన పామెలా బేడీకి అక్కడి కాంగ్రెస్ సభ్యులు (Six US Congressmen) లాన్స్ గూడెన్, ప్యాట్ ఫాలన్, మైక్ హారిడోపోలస్, బ్రాండన్ గిల్, విలియం ఆర్. టిమ్మన్స్, బ్రియాన్ బాబిన్ లేఖ రాశారు. అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయశాఖ (DOJ) అభియోగాలు రాజకీయ ప్రేరితమైనవేనా? అనే అంశంపై ప్రశ్నలు లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది.
ఏదైనా కుట్ర కోణం ఉందా?
భారత ప్రభుత్వానికి అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందా? అమెరికా న్యాయశాఖ (US Department of Justice)కు ఈ వ్యవహారంలో ప్రత్యక్ష సంబంధం ఏమిటి.. ఈ కేసు అమెరికా-భారత్ సంబంధాలను దెబ్బతీయగలదా? అనే ప్రశ్నలను అక్కడి కాంగ్రెస్ సభ్యులు సంధించారు. డీవోజే (అమెరికా న్యాయశాఖ ) తీసుకున్నది అమెరికా ప్రయోజనాలకు ఉపయోగపడే నిర్ణయమా. లేక రాజకీయ కుట్రనా? అనే అంశాలను పరిశీలించాలని కోరారు.
Adani’s indictment కేసు ఏమిటి?
భారత ప్రభుత్వ అధికారులకు అదానీ గ్రూప్ లంచం ఇచ్చిందనేది అమెరికా న్యాయశాఖ ఆరోపణ. సుమారు 250 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 2,100 కోట్లు) అదానీ గ్రూప్ నుంచి భారత ప్రభుత్వానికి ముడుపులుగా అందాయని అంచనా. భారత ప్రభుత్వం నుంచి సౌరశక్తి ఒప్పందాలను పొందడానికి అదానీ గ్రూప్ ఈ లంచం ఇచ్చిందని అమెరికా న్యాయశాఖ ఆరోపిస్తోంది. ఈ లావాదేవీలను అమెరికా బ్యాంకుల నుంచి రహస్యంగా జరిగాయని, అక్కడి (అమెరికా) పెట్టుబడిదారుల నుంచి ఈ మొత్తాన్ని అదానీ గ్రూప్ సేకరించిందని ఈ కేసులోని కీలకాంశం. అయితే.. ఈ కేసు రాజకీయంగా ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ముఖ్యంగా బైడెన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అనేక చర్చలకు దారి తీసింది.
ఈ కేసు దేనికి దారి తీయొచ్చు?
అదానీ గ్రూప్‌పై అమెరికా న్యాయ శాఖ చేసిన అభియోగాల నేపథ్యంలో ఈ కేసు వల్ల భారతదేశంపై ఒత్తిడి పెరుగుతుందా? రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలను దెబ్బతీయగలదా? అనేది చర్చనీయాంశమైంది. ప్రధానంగా అమెరికా-చైనా సంబంధాలపై ఈ కేసు ప్రభావం చూపిస్తుందా? అనేది హాట్ టాపిక్ అయ్యింది.
నిరాధార ఆరోపణలు : గౌతం అదానీ
అమెరికా న్యాయశాఖ చేసిన ఆరోపణలను అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ (Goutham Adani) కొట్టిపారేశారు. ఇవి పూర్తిగా నిరాధార అభియోగాలని, రాజకీయ ప్రేరితమైనవి అని ఖండించారు. తమ కంపెనీ ఎప్పుడూ అంతర్జాతీయ నియమాలను పాటిస్తోందని పేర్కొన్నారు. అమెరికా-భారత్ సంబంధాలను దెబ్బతీసేలా ఈ అభియోగాలు ఉన్నాయని ఆదానీ ఆందోళన వ్యక్తం చేశారు.
లైట్‌గా తీసుకున్న భారత సర్కార్
Adani’s indictment భారత ప్రభుత్వం ఈ కేసును ఒక ప్రైవేట్ లీగల్ ఇష్యూ (తనిఖీ చేయాల్సిన న్యాయపరమైన అంశం) గా పేర్కొంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) దీనిపై పెద్దగా స్పందించలేదు. ఇది అమెరికా న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం అని మాత్రమే వ్యాఖ్యానించింది. అయితే.. ఇది భారత్‌పై భవిష్యత్‌లో ఏమాత్రం ప్రభావం చూపనుందో వేచి చూడాలంటున్నారు విశ్లేషకులు. భారత ప్రభుత్వం దీన్ని తీవ్రంగా పరిగణిస్తే అమెరికాతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాల్లో మార్పులు రావచ్చని అంటున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..