Tollywood News | వరుస హిట్లతో నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandhamuri Balakrishna) మంచి జోరు మీద ఉన్నారు. లేటెస్ట్ గా బాబి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్(Daku Maharaj) తో హిట్టుకొట్టాడు. వెంటనే అఖండకి సీక్వెల్ గా అఖండ -2 సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
బాలయ్య-బోయపాటి (Balayya -Boyapati) కాంబినేషన్ అంటేనే ఒక మాస్ క్రేజ్ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. అంచనాలకు మించేలా వీరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ హిట్ అయ్యాయి. మొదటిసారిగా సింహా మూవీతో వీళ్ళు చేతులు కలిపారు. అప్పటివరకు సీనియర్, జూనియర్ డైరెక్టర్లతో పని చేసిన బాలయ్య ప్లాపులనే చవిచూశాడు. సింహాతో బాలయ్య మళ్ళీ తన మునుపటి ఫామ్ ని అందుకున్నాడు.
ఏ ముహూర్తాన చేతులు కలిపారో కానీ ఇప్పటివరకు మూడు సినిమాలు తీసి ఒక దానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్లో మూవీ వస్తుందంటేనే రికార్డులు బద్దలు కావడం ఖాయం అనే పేరు తెచ్చుకున్నారు. ఆఖరిగా వీళ్ళ కాంబినేషన్లో అఖండ (Akhanda) మూవీ వచ్చి ఎంత భారీ హిట్ అయిందో మనకు తెలుసు. అప్పుడే దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని వీరు కన్ఫామ్ చేశారు. మధ్యలో బోయపాటి రామ్ తో స్కంద మూవీ తీసి ఫ్లాప్ ని ఎదుర్కొన్నాడు. బాలయ్య మాత్రం వరుస హిట్లు కొడుతూనే ఉన్నాడు.
బోయపాటి ప్లాఫ్ లో ఉన్న కూడా తనను నమ్మి అఖండ -2 స్టార్ట్ చేశాడు. ఇది వీరి కాంబినేషన్లో మరొక బ్లాక్ బస్టర్ ఖాయమని ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. బోయపాటికి బాలయ్య సినిమా అంటే ఎక్కడలేని పూనకంతో క్యారెక్టర్ ను డిజైన్ చేసి ఫుల్ మాస్ అవతారంలో చూపిస్తాడు. మరి అఖండ-2 లో బాలయ్యను డిజైన్ చేసిన తీరు ఇంకా పవర్ఫుల్ గా ఉంటుంది కావొచ్చని ఆడియన్స్ ఊహించుకుంటున్నారు. ఆఖండకు మ్యూజిక్ అందించిన తమన్.. అఖండ -2కు కూడా మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల వరుసగా బాలయ్య తీసిన సినిమాలకు తమన్ నే మ్యూజిక్ డైరెక్టర్గా ఎంచుకుంటున్నారు. బాలయ్య- తమన్ ది కూడా హిట్ కాంబినేషన్ గా నిలిచిపోయింది. బాలయ్య యాక్షన్ , తమన్ మ్యూజిక్ బోయపాటి క్యారెక్టర్ డిజైన్ కు థియేటర్లో బాక్సులు బద్దలు కావడం ఖాయమని బాలయ్య అభిమానులు అంచనా వేస్తున్నారు.
Nandhamuri Balakrishna మూవీలో విలన్ గా అతడే..
ఇదిలా ఉండదా ఈ మూవీలో బాలయ్య (Balakrishna) కు ఆపోజిట్ గా విలన్ రోల్ లో టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి (Adi pini shetty ) నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకు బోయపాటి డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన సరైనోడు మూవీ లో ఆది పవర్ఫుల్ విలన్ గా చేసిన సంగతి తెలిసిందే . అఖండ -2 లో విలన్ గా ఆది పినిశెట్టి మరొకసారి పవర్ ఫుల్ గా బోయపాటి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య- ఆది పినిశెట్టి ఇద్దరు పోటీ పడుతుంటే ఆడియన్స్ విజిల్స్ తో థియేటర్లు మారుమోగుతాయని సినీ వర్గాలు అనుకుంటున్నాయి.మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ అయి వీరి కాంబినేషన్ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








