Adilabad News : రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగిస్తోంది. అవినీతి అధికారులకు ఏసీబీ చుక్కలు చూపిస్తోంది. వరుస దాడులతో అక్రమార్కును హడలెత్తిస్తోంది. తాజాగా చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా సబ్ రిజిస్ట్రార్ ( Sub-Registrar )ను లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా పట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్ కార్యాయంలో బాధితుడు నుంచి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్ ఖాన్ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. చివరకు రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్ లంచం తాలూకు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.