Ahmedabad | గుజరాత్ లోని ఎయిర్ పోర్ట్ లో ఘోర విమాన ప్రమాదం (Plane Crash ) యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి సుమారు 250 మంది ప్రయాణికులతో గురువారం లండన్ బయలుదేరిన విమానం టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలిపోయింది. ఫ్లైట్ నెంబర్ ఏఐ171 విమానం 242 మంది ప్రయాణికులతో గురువారం మధ్యాహ్నం లండన్ వెళ్లడానికి అహ్మదాబాద్ ఎయిర్ ఫోర్ట్ నుంచి టేకాఫ్ అయింది. ఎప్పటిలాగే ఏఐ 171 విమానంగాలి లోకి ఎగిరే ముందు అన్ని సాంకేతిక సమస్యలను తనిఖీ చేసుకున్నాకే టెకాఫ్ అయింది . అయితే రన్ వే నుంచి టెక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే విమానం ప్రమాదానికి గురైంది . మేఘాని నగర్ గోడసర్ క్యాంప్ ప్రాంతాలయంలో విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భారీ ఎత్తున పేలుడు శబ్దం తోపాటు దట్టమైన పొగ అలుముకుంది సుమారు విమానం 825 అడుగుల ఎత్తులో ఉండగా సాంకేతిక లోపం కారణంగానే విమాన, కింద పడిపోయినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలవడ్డాయి.
ఫ్లైట్ కొద్దికొద్దిగా కిందకి వాలిపోతూ సరిగ్గా 1:30 సమయంలో పూర్తిగా దిగుతూ చెట్టును ఢీకొట్టింది. ఆ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదానికి గురైన వైట్ బాడీ బోరింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో 242 మంది ప్రయాణిస్తున్నారు.
విమానం కూలిపోయిందనే సమాచారంతో ఫైర్ ఇంజన్లు ఆ ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ రూపాని కూడా ఉన్నారు. కాగా ప్రమాదం గురించి తెలుసుకుని కేంద్ర పౌర విమానాయాల శాఖ మంత్రి రామ్మోహన్ హుటాహుటిన ఘటన స్థలానికి బయలుదేరారు. అంతేకాదు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సైతం ఈ ఘటనపై స్పందించింది. విమానానికి కెప్టెన్లుగా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుందల్ వ్యవహరించినట్లు తెలిపారు. సుమిత్ కి ఎల్టిసిగా 8200 గంటలు అలాగే కోపైలెట్ 1100 గంటల అభుభవం ఉన్నట్లు వెల్లడించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.