Air India Ahmedabad Plane Crash Live Updates : ఇటీవలి సంవత్సరాలలో అత్యంత ఘోరమైన విమాన ప్రమాదాలలో ఒకటి.. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానం AI171 గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది, విమానంలో 241 మంది మరణించారు. శుక్రవారం ఉదయం విమానయాన సంస్థ ప్రాణనష్టాన్ని నిర్ధారించింది.
Plane Crash : ప్రమాద తీవ్రత: 1000 డిగ్రీల సెల్సియస్ మంటలు
ప్రమాదానికి (Air India Plane Crash) కారణమేంటంటే దానిపై స్పష్టత ఇప్పటివరకు రానప్పటికీ.. ఈ ఘటనకు సంబంధించి పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విమానం కూలిన తర్వాత ఘటన స్థలంలో 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటలు చెలరేగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సహాయక చర్యలు అత్యంత క్లిష్టంగా మారినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు వైద్యకళాశాల హాస్టల్‌లో ఉన్న 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలకు అహ్మదాబాద్ ప్రభుత్వ హాస్పిటల్ లో పోస్టుమర్టం జరిగింది. ప్రమాదం ధాటికి చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. దీనితో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగిస్తున్నారు.
అహ్మదాబాద్‌కు ప్రధాని మోదీ
శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాద స్థలాన్ని అలాగే అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిని కూడా సందర్శించారు. ప్రధానమంత్రి అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు.
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:38 గంటలకు దాదాపు 242 మందితో బయలుదేరింది. ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్, భారత సంతతికి చెందిన బ్రిటిష్ జాతీయుడిగా గుర్తించారు. ప్రస్తుతం స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రయాణీకులలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ జాతీయులు, 7 మంది పోర్చుగీస్ జాతీయులు. 1 కెనడియన్ జాతీయుడు ఉన్నారు.
ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన
ఎయిర్ ఇండియా తన X (గతంలో ట్విట్టర్) హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన అధికారిక ప్రకటనలో, ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేసింది. “ఇప్పుడు మా ప్రయత్నాలు పూర్తిగా బాధిత వారందరి అవసరాలపై, వారి కుటుంబాలు. ప్రియమైనవారిపై కేంద్రీకృతమై ఉన్నాయి” అని ఎయిర్‌లైన్ తెలిపింది.
ద్ చేరుకుంది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన రమేష్ మాట్లాడుతూ.. “టేకాఫ్ అయిన ముప్పై సెకన్ల తర్వాత, పెద్ద శబ్దం వచ్చింది. విమానం కూలిపోయింది. ఇదంతా చాలా త్వరగా జరిగింది… నేను లేచినప్పుడు, నా చుట్టూ మృతదేహాలు ఉన్నాయి. నేను భయపడ్డాను. లేచి పరిగెత్తాను. నా చుట్టూ విమానం ముక్కలు ఉన్నాయి. ఎవరో నన్ను పట్టుకుని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తీసుకువచ్చారు,” అని ప్రాణాలతో బయటపడిన రమేష్ మీడియాకు చెప్పారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.