Aishwarya Rajesh : ఐశ్వర్య రాజేష్ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తెలుగు, తమిళంలో తనకంటూ ఒక పేరును సంపాదించుకుంది. ఒకప్పటి లేడీ కమెడియన్ శ్రీలేఖ తమ్ముడు రాజేష్ కూతురే ఈ ఐశ్వర్య. తమిళంలో చాలా సినిమాలే చేసినా తెలుగులో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
సినీ ఇండస్ట్రీలో హీరోలు దశాబ్దాలుగా రాణిస్తుంటారు. హీరోయిన్లకు మాత్రం ఆ అవకాశం ఉండదు. అలా రాణించేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో త్రిష, నయనతార దాదాపు రెండు దశాబ్దాలకు పైగా హీరోయిన్లుగా సీనియర్లతో పాటు జూనియర్లతో కూడా సినిమాలు చేస్తూ కెరీర్ లోనే పీక్ లో ఉన్నారు.
ఓవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేస్తూనే అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా కూడా రాణిస్తున్నారు. అయితే వారిలాగే టాలెంట్ ఉన్న ఐశ్వర్య రాజేష్ కు మాత్రం అగ్ర హీరోల పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం అయితే పెద్దగా అయితే రాలేదు.
Aishwarya Rajesh Movie ఇప్పుడు విక్టరీ వెంకటేష్ (Venkatesh) పక్కన హీరోయిన్ గా సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక పెద్ద మూవీ చేస్తోంది. ఈ మూవీ ఐశ్వర్య రాజేష్ కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా నిలుస్తోందని సినీ ఇండస్ట్రీలో టాక్ వినబడుతోంది. ఇప్పటికే ఈ మూవీ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేస్తున్న మూవీ ప్రమోషన్స్ లో వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. ఈ మూవీలో వీళ్ళ జోడి భలే కుదిరిందని సినీ ప్రేక్షకులు అనుకుంటున్నారు. ఈ మూవీ హిట్ అయితే ఆమె కెరీర్ మరింత ఊపందుకుంటుంది.
టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరికే పరిస్థితి కష్టంగా మారింది. సంక్రాంతికి వస్తున్నాం మూవీ ట్రైలర్ చూస్తే ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) పాత్రకు మంచి స్కోపే ఉంటుందని తెలుస్తోంది. గ్లామర్ రోల్ లో కాకుండా హోమ్లి క్యారెక్టర్ చేస్తుండడం తో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఈ మూవీతో పెరుగుతుందని చెప్పొచ్చు. ఎలాగైనా ఈ పొంగల్ కి భారీ హిట్టు కొట్టి హీరోయిన్ గా మరిన్ని అవకాశాలను చేజిక్కించుకోవాలని చూస్తోంది. ఐశ్వర్య రాజేష్ కి ఈ అవకాశం అయినా కలిసొచ్చి టాలీవుడ్ లో పాగా వేస్తుందో లేదో చూడాలి…
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..