తమిళ్ స్టార్ హీరో అజిత్ కి (Ajith kumar ) కొంత కాలంగా కలిసి రావడం లేదు.ఆయన తీసిన విదామియార్చి (తెలుగులో పట్టుదల) ఇటీవల రీలీజ్ కాగా డిజాస్టర్ గా నిలిచింది.అంతకుముందు మూవీస్ కూడా అంతగా ఆడలేదు. అజిత్ అభిమానులకు నిరాశగానే ఉంది. ఒక్క హిట్టు కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. తన స్టైల్ లో ఒక్క స్టోరీ పడితే ఎంతటి హిట్టు కొడుతాడో మనకు తెలుసు. శివ (shiva) డైరెక్షన్ లో వీరం, వేధాలం, విశ్వాసం తన కెరియర్ లో మంచి వసూళ్లను సాధించాయి.పట్టుదల మూవీ ఏ మాత్రం ఆయన స్టైల్ కి తగ్గట్టుగా డైరెక్టర్ ప్రజెంట్ చేయలేకపోయాడు. ఫ్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. అజిత్ రేంజ్ మూవీ కాదని తేల్చి పడేశారు.
రెండు క్రేజీ మూవీస్ కి పోటీగా..?
Ajith kumar New Movie అజిత్ ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ (Adhik ravichandran) డైరెక్షన్ లో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad Ugly movie) మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. ఏప్రిల్ 10 న ఈ మూవీ రిలీజ్ కానుంది.ఈ మూవీకి పోటీగా సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో జాత్ మూవీ, అలాగే బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్లో జాక్ మూవీ రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలపై ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అజిత్ పట్టుదల మూవీ డిజాస్టర్ తర్వాత ఈ మూవీపై ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుున్నారు. ఈ సారి ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్టు ఖాయం అని ధీమాతో ఉన్నారు. అజిత్ బాక్సాఫీస్ వద్ద గర్జిస్తాడని, రికార్డులన్ని తుడిచి పెట్టడం ఖాయమంటున్నారు.
Ajith -Simran : రెండు దశాబ్దాల తర్వాత..
అయితే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. రెండు దశాబ్దాల కింద అజిత్ కెరీర్ ని మలుపు తిప్పిన వాలీ (Ajith -Simran) మూవీ కాంబో రిపీట్ అవుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ మూవీని ప్రెజెన్ట్ మూవీస్ లో విలన్ గా అదరగొడుతున్న ఎస్ జే సూర్య డైరెక్ట్ చేశారు. ఈ మూవీతోనే ఆయన డైరెక్టర్ గా మారింది. ఇక అజిత్ సరసన సిమ్రాన్ యాక్ట్ చేసింది. ఈ మూవీలో అన్న,తమ్ముడిగా అజిత్ డ్యుయల్ రోల్ లో అదరగొట్టారు. పాజిటివ్, నెగటివ్ క్యారెక్టర్లో అజిత్ వైవిధ్యం చూపించారు. తన బావ చేతిలో ఇబ్బంది పడే క్యారెక్టర్ లో సిమ్రాన్ సూపర్ పర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పొచ్చు. మ్యూజిక్ డైరెక్టర్ దేవా ఇచ్చిన పాటలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ తరువాత వీరి కాంబినేషన్లో మూవీస్ వచ్చినా ఈ మూవీ హిట్టయినంత మరేదీ కాలేదు.
ఇదిలా ఉండగా తాజాగా అజిత్ హీరోగా వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ లో సిమ్రాన్ మెరవబోతునట్టు తెలుస్తోంది. ఒక ముఖ్యమైన క్యారెక్టర్ లో కనిపించబోతునట్టు టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ విని ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు. రెండు దశాబ్దాల తర్వాత వీరి కాంబో మళ్లీ తెరపై సందడి చేస్తే చూడాలని ఎదురుచూస్తున్నారు. కాగా ఈ మూవీలో హిరోయిన్ గా త్రిష, ముఖ్యమైన క్యారెక్టర్ లో ప్రభు, సునీల్ నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ పనిచేయగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జీవీ ప్రకాష్ కుమార్ అందించబోతున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








