మహారాష్ట్రలో దయా నాయక్ (Daya Nayak).. ‘ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు’గా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆయనకు ఏసీపీగా పదోన్నతి లభించడంతో మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఆయనతోపాటు మరికొందరు అధికారులు కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ACP)లుగా ప్రమోషన్ పొందారు. 1990ల్లో ముంబయిలో అండర్‌వరల్డ్ కార్యకలాపాలు తీవ్రంగా ఉన్న కాలంలో సుమారుగా 80 మంది గ్యాంగ్‌స్టర్లను దయా నాయక్ ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం. ఈ దయానాయక్ స్ఫూర్తితో గతంలో హిందీతోపాటు పలు భాషల్లో సినిమాలు వచ్చాయి.
దయా నాయక్ ఎవరు..?
కర్ణాటకలోని ఉడిపికి చెందిన దయా నాయక్ (Daya Nayak) తన కుటుంబాన్ని పోషించుకోవడానికి 1979లో ముంబైకి వెళ్లి ఓ టీ స్టాల్‌లో తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. గోరేగావ్‌లోని మునిసిపల్ పాఠశాల నుండి 12వ తరగతి పూర్తి చేసి, తరువాత అంధేరిలోని CES కళాశాల నుంచి పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత 1995లో ముంబయిలో ఎస్సై ఉద్యోగం సాధించారు. ఆ సమయానికి నగరంలో నేరాలు పేడ్రేగిపోతుండేవి. అండర్‌వరల్డ్ డాన్లు గ్రూపులుగా దందాలు, హత్యలు, డ్రగ్స్, హవాలా సహా ఎన్నో ఘోరాలు జరిగేవి. ఈ క్రమంలోనే 1996లో చోటా రాజన్ గ్యాంగ్‌లోని ఇద్దరిని ఎన్‌కౌంటర్ చేయడంతో దయా నాయక్ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. ఈ క్రమంలో అండర్ వరల్డ్ నెట్‌వర్క్‌కు సంబంధమున్న సుమారు 80 మంది గ్యాంగ్‌స్టర్లను ఎన్‌కౌంటర్ చేసినట్లు సమాచారం.
మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS)లో దయానాయక్ పనిచేశారు. 2021లో ముఖేష్ అంబానీ (Mukesh Ambani) ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసు, అనంతరం ఠాణె వ్యాపారవేత్త మన్‌సుఖ్ హిరెన్ హత్య కేసుల దర్యాప్తు బృందాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అంతేకాదు బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan)పై జరిగిన దాడి ఘటన దర్యాప్తు బృందంలోనూ ఉన్నారు. మన్సుఖ్ హిరాన్ హత్యకు సంబంధించిన దర్యాప్తులో అతని బృందం పాత్ర పోషించింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.