Allu Arjun 175 crore remuneration | టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun)యాక్ట్ చేసిన పుష్ప, పుష్ప 2 (Pushpa, Pushpa 2)మూవీ ల తో తన రేంజ్ ఎవరికీ అందనంత గా పెరిగిపోయింది. పుష్ప 2 అయితే దాదాపు 1800 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినీ హిస్టరీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
800 కోట్లతో హాలీవుడ్ రేంజ్ లో…
ఈ మూవీ తర్వాత అట్లీ (Atlee)డైరెక్షన్ లో ఓ భారీ మూవీ తెరకెక్కబోతున్నట్టు తెలిసిందే. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయి సెట్స్ పై ఉంది. ఆ మధ్య అట్లీ రిలీజ్ చేసిన వీడియో కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఏ జానర్ లో మూవీ రాబోతుందో ఆ వీడియో తో మూవీ టీం ఆడియన్స్ కి క్లారిటీ ఇచ్చారు. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో మూవీని తీస్తున్నారు. ఈ మూవీతో అల్లు అర్జున్ మరోసారి హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
వీఎఫ్ఎక్స్ కే రూ.300 కోట్లు..?
వీఎఫ్ ఎక్స్ కే ఎక్కువ మొత్తం ఖర్చు అవ్వబోతున్నట్టు తెలుస్తోంది. దాదాపు 300 కోట్లు దానికే ఖర్చు చేస్తున్నారంటే మూవీ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. అయితే అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కి అల్లు అర్జున్ భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఏకంగా 175 కోట్లు అందుకోబోతున్నట్టు టాక్ వినబడుతుంది.
ప్రభాస్ ను దాటిన అల్లు అర్జున్….
ప్రజెంట్ టాలీవుడ్ హీరోల్లో రెబల్ స్టార్ ప్రభాస్ (prabhas)ఒక్కో సినిమా కు 120 కోట్లు తీసుకుంటున్నాడట. ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో అల్లు అర్జున్.. ప్రభాస్ కంటే ముందున్నాడు. మూవీలో హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్న దీపికా పదుకునే కు (deepika padukone)కూడా ప్రొడ్యూసర్స్ భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.
ఫ్యాన్స్ అంచనా – హాలీవుడ్ రేంజ్ మూవీ ఖాయం!
సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్స్ కాన్సెప్ట్ తో అట్లీ సరికొత్త కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి థ్రిల్ పంచబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ మూవీ 2027 లో రిలీజ్ కాబోతున్నట్టు టాక్. సన్ పిక్చర్స్ బ్యానర్ లో(sun pictures bannar)నిర్మిస్తుండడం, అట్లీ అల్లు కాంబో కావడం, దీపిక ఇందులో భాగం అవ్వడం, హాలీవుడ్ రేంజ్ లో మూవీ రాబోతుండడం చూస్తే ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాల లో ఇది బెస్ట్ మూవీ గా నిలిచిపోతుందని సినీ లవర్స్ చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లో ఒక మైల్ స్టోన్ మూవీ గా హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
 
								 
															








 
				 
				 
				 
                                                                     
                                                                     
                                                                    