Sarkar Live

Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?

Allu Arjun | టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. బడా హీరోల సూపర్ హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీల కంటే వారి పాత

Allu Arjun

Allu Arjun | టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. బడా హీరోల సూపర్ హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీల కంటే వారి పాత సినిమాలే ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. అప్పటి పాటలు థియేటర్లో వస్తుంటే ఆడియన్స్ కూడా పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో డిజాస్టర్ అయిన మూవీస్ కూడా రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.

ఆ మూవీలను అప్పుడు థియేటర్లో చూడని వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈసారి థియేటర్ లో మూవీని చూసే ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని వెంటనే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే ఈ మూవీస్ ని చూడడాని కే ఆడియన్స్ ఫస్ట్ ప్రియార్టీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Pawan Kalyan and mahesh babu movies) మూవీస్ రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వారి మూవీల అప్పట్లో వచ్చిన ఆదరణ కంటే రెట్టింపు ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.

Allu Arjun డిజాస్టర్లు కూడా సూపర్ హిట్స్..

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, ఎన్టీఆర్ (Mega Star Chiranjeevi, Ram Charan, NTR) ఇలా అగ్ర హీరోల అందరి మూవీస్ ను కూడా రీ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ డిజాస్టర్ మూవీ ఆరెంజ్ అయితే రీ రిలీజ్ లో క్లాసిక్ గా నిలిచిపోయింది. ఎవ్రీ ఇయర్ లవర్స్ డే రోజున రిలీజ్ చేస్తున్నారు. ప్రతిసారి కూడా అదే రేంజ్ లో ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అప్పట్లో రిలీజ్ అయిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచి ప్రొడ్యూసర్ నాగబాబు(nagababu)పూర్తిగా అప్పుల్లో కోరుకపోయి ఆత్మహత్య చేసుకునే దాకా వెళ్ళాడంట ఈ మూవీ మిగిల్చిన నష్టాలు ఊహించుకోవచ్చు. కానీ రీ రిలీజ్ లో మాత్రం ఈ మూవీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.

ఏప్రిల్ 5న థియేటర్లలో..

ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (icon star Allu Arjun)నటించిన ఆర్య 2 (Arya 2) మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 7న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రెండు రోజుల ముందుగానే ఏప్రిల్ 5న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ లో కొన్ని థియేటర్లలో టికెట్స్ వెంటనే అమ్ముడుపోయాయి. ఆర్య 2 రిలీజ్ అయినప్పుడు అందులోని పాటలు యూత్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. ఇప్పటివరకు రీ రిలీజ్ అయిన మూవీస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ దాదాపు 7 కోట్ల రూపాయల వసూళ్ళు సాధించి టాప్ లో ఉంది. పాటలతో ఆడియన్స్ ని ఉర్రూతలూగించిన ఆర్య 2 మూవీ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుని టాప్ లో కి వెళ్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఏదైనా మళ్లీ ఈ మూవీ థియేటర్ లోకి రానుండడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరపడి పోతున్నారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?