Allu Arjun Press meet | ఇటీవల పుష్ప 2 : ది రూల్ ప్రీమియర్ షోలో జరిగిన తొక్కిసలాటపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి , ఏఐఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర విమర్శల నేపథ్యంలో నటుడు అల్లు అర్జున్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ విషాద సంఘటనపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు, తొక్కిసలాట పూర్తిగా ప్రమాదవశాత్తుగా జరిగిందని స్పష్టం చేశారు. ఈ విషాదంలో బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.
” బాధిత కుటుంబానికి జరిగినదంతా నిజంగా హృదయ విదారకమైనదని అల్లు అర్జున్ ఎమోషనల్‌గా చెప్పాడు. “నేను ప్రతీ కొన్ని గంటలకోసారి బాలుడు శ్రీతేజ్ ఆరోగ్యంపై ఆరా తీస్తున్నాను. నాకూ ఆ బాలుడి వయస్సు ఉన్న కొడుకు ఉన్నాడు. పరిస్థితి తీవ్రత నాకు తెలుసు అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.
అలాగే అల్లు అర్జున్ మీడియా సమావేశంలో వివిధ రాజకీయ ప్రముఖుల విమర్శలకు ప్రతిస్పందించారు. “నా గురించి చాలా తప్పుడు విషయాలు మాట్లాడుతున్నారు. “నిరాధార ఆరోపణలకు పాల్పడకుండా వాస్తవాలపై దృష్టి పెట్టాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అని పేర్కొన్నారు.
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేను ఎవరూ దూషించాలని అనుకోవడంలేదు. 20 ఏళ్లుగా మీరు నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా? ఈ ఘటనపై మిస్ ఇన్‌ఫర్మేషన్, మిషన్ కమ్యూనికేషన్ జరుగుతోంది. ఈ ఘటనలో నా క్యారెక్టర్‌ను కించపరిచారు. నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని.. మూడేళ్లుగా కష్టపడ్డ పుష్ప 2 (Pushpa 2) సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్ (Sandhya Theater)కు వెళ్లాను. నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను. పోలీసులే ట్రాఫిక్ క్లియర్ చేశారు. తాను రోడ్ షో, ఊరేగింపు చేయలేదని స్పష్టం చేశారు.
“మరుసటి రోజు ఉదయం, విషాద సంఘటన గురించి పూర్తి స్థాయిని నేను అర్థం చేసుకున్నాను” అని అల్లు అర్జున్ అన్నారు. “నేను మా నాన్నతో పాటు బాధిత కుటుంబాన్ని వ్యక్తిగతంగా కలవాలని అనుకున్నాను, కానీ ప్రస్తుతం న్యాయమపరమైన విచారణల కారణంగా అది సాధ్యం కాలేదు. కానీ నా దృష్టి మొత్తం బాధిత కుటుంబంపై ఉంది. అని అల్లు అర్జున్ తెలిపారు.
శ్రీతేజ్‌కు మంచి చికిత్స అందించాలని అనుకున్నామని, తెలుగువారి పరువు నిలబెట్టేందుకు తాను సినిమాలు చేస్తుంటే తనను దిగజార్చే యత్నాలు జరుగుతున్నాని అల్లు అర్జున్ అన్నారు. తాను ఏ పార్టీ నాయకుడిని తప్పుబట్టడం లేదని.. నాకు పర్మిషన్ ఇప్పుడే వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శిస్తానని చెప్పారు. తాను మానవత్వాన్ని నమ్మే వ్యక్తిని.. మీడియా ముందు షో చేయడం లేదని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..