Amaravati Rajadhani : అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు (Amaravati Capital Development project)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీగా నిధులను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు (World Bank) నుంచి మొట్టమొదటి విడతగా 205 మిలియన్ డాలర్ల (రూ. 1,700 కోట్లకు పైగా) నిధులు అందిన వెంటనే, కేంద్రం తన వాటా రూపంలో రూ. 800 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం రూ. 4,285 కోట్లు రాష్ట్రానికి జమ అయ్యాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు.
Amaravati Rajadhani : రూ. 15,000 కోట్ల ప్రణాళిక
రాజధాని అభివృద్ధి (Amaravati Capital Development project) కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో రూ. 15 వేల కోట్లను కేటాయించింది. ఇందులో ప్రపంచ బ్యాంకు (WB), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (Asian Development Bank (ADB) తలా USD 800 మిలియన్ (మొత్తం USD 1,600 మిలియన్) రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన రూ. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా రాష్ట్రానికి అందుతాయి.
మొదటి విడత నిధుల విడుదల
ప్రాజెక్ట్ జనవరి 22న అధికారికంగా ప్రారంభమైంది. అదే రోజు నుంచి ప్రాజెక్ట్ “ఎఫెక్టివ్”గా పరిగణించబడింది. తర్వాత నెలలో ప్రపంచ బ్యాంకు నుంచి USD 205 మిలియన్ విడుదలైంది. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కూడా తాము ముందుగానే ప్రకటించిన నిధుల్లో భాగంగా రూ. 800 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రానికి మొత్తం రూ. 4,285 కోట్లు కేంద్రం నుంచి జమ అయినట్టయ్యింది. ఇందులో “మొబిలైజేషన్ అడ్వాన్స్” పేరిట మొత్తం నిధుల్లో 25% ముందుగానే అందాయి.
Amaravati Rajadhani :రెండో విడత నిధులు ఎప్పుడు?
ప్రాజెక్ట్ పనులు ఇప్పుడే ప్రారంభమైన దశలో ఉన్నాయి. రెండో విడత నిధులను కేంద్రం నుంచి పొందాలంటే రాష్ట్ర ప్రభుత్వం పనుల్లో పురోగతి చూపించాలి. అలాగే వినియోగ ధృవీకరణ పత్రాలు (Utilization Certificates) అందించాలి. దీనికి ఇంకా ఆరు నెలలైనా పట్టొచ్చని ఓ ఉన్నతాధికారి తెలిపారు. పనులు ఇప్పుడే మొదలయ్యాయని, మరో రెండు, మూడు నెలల్లోనే వేగం పుంజుకుంటాయని అంటున్నారు.
అమరావతిని సందర్శించిన వరల్డ్ బ్యాంకు బృందం
అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులు పర్యావరణానికి, స్థానికుల జీవన ప్రమేయాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ కొన్ని ఫిర్యాదులు ప్రపంచ బ్యాంకుకు చేరాయి. అయితే.. ప్రపంచ బ్యాంకు వద్ద చాలా బలమైన, స్వతంత్రంగా పనిచేసే ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ఉంది. ఈ విషయాలపై గత నెలలో వరల్డ్ బ్యాంక్, ADB నుంచి వచ్చిన ఆరుగురు సభ్యుల బృందం అమరావతిని సందర్శించి, స్థల పరిశీలన చేసింది.
Amaravati Rajadhani : ఐడీబీఆర్ పాత్ర
ఈ ప్రాజెక్టును వరల్డ్ బ్యాంకు లో భాగమైన International Bank for Reconstruction and Development (ఐబీఆర్‌డీ) నిధుల రూపంలో సమకూరుస్తోంది. IBRD ప్రధానంగా మధ్య ఆదాయ దేశాలకు, వృద్ధి చెందుతున్న దేశాలకు ఆర్థికంగా సహాయం చేస్తుంది. IBRD ద్వారా అమరావతి రాజధాని నిర్మాణానికి USD 800 మిలియన్ అందించనుంది. ఈ నిధులతో మౌలిక సదుపాయాలు, రహదారులు, కాలనీలు, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు మొదలైన నిర్మాణాలు జరుగుతాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.








