US H-1B visa : హెచ్-1బీ వీసాల నిబంధనలను అమెరికా ప్రభుత్వం సడలించింది. కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. ముఖ్యంగా ఎఫ్-1 స్టూడెంట్ వీసా నుంచి హెచ్-1బీ వీసాలోకి సులభంగా మార్చుకొనే అవకాశాన్ని కల్పించింది. అమెరికా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయ టెక్ నిపుణులకు పెద్ద ఊరట కలగనుంది. స్టూడెంట్ వీసా నుంచి హెచ్-1 వీసాలోకి మార్చుకొనే వెసులుబాటుతో తాము అనేక గొప్ప అవకాశాలు పొందొచ్చనే హర్షం వ్యక్తమవుతోంది.
H-1B visa అంటే ఎందుకింత క్రేజ్?
America Visa : హెచ్-1బీ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీయులను నియమించుకునేందుకు అమెరికన్ కంపెనీలకు అవకాశం దీని ద్వారా ఉంటుంది. అత్యంత ఆధునిక సాంకేతికత నైపుణ్యాలను కలిగిన వారిని భారత్, చైనా లాంటి దేశాల నుంచి ప్రతి సంవత్సరం పెద్దఎత్తున నియమించుకోవడంలో ఈ వీసా కీలక పాత్ర పోషిస్తోంది.
మార్పుతో సౌలభ్యం
హెచ్-1బీ వీసాలపై కొత్త మార్గదర్శకాలను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) ప్రకటించింది. అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను అమెరికా కంపెనీలు ఈ మార్పు ద్వారా నియమించుకొనేందుకు మరింత అనుకూలత లభించనుందని పేర్కొంది. తద్వారా ప్రపంచ మార్కెట్‌లో అమెరికా కంపెనీలు నిలదొక్కుకొనేందుకు ఇదెంతో కీలకమని తెలిపింది.
అనేక అవకాశాలు..
- ఈ మార్గదర్శకాలు ఎఫ్-1 వీసా విద్యార్థులు హెచ్-1బీ వీసాకు మార్పు పొందడంలో అనేక కొత్త అవకాశాలను అందిస్తున్నాయి
- చట్టపరమైన స్థితి, ఉపాధి అనుమతులు నిలబెట్టుకునేందుకు ఈ మార్పులు ఎంతో దోహదపడతాయి.
- అంతకుముందు హెచ్-1బీ వీసా పొందిన వారికి వేగవంతమైన ప్రాసెసింగ్ ద్వారా మరింత సౌలభ్యాన్ని కల్పిస్తాయి
- తాము పనిచేస్తున్న సంస్థలో పెట్టుబడులు ఉన్నవారు కూడా న్యాయపరమైన నియమాలకు లోబడి హెచ్-1బీ వీసా పొందే వీలును కల్పిస్తాయి.
- అమెరికన్ సంస్థలకు గ్లోబల్ టాలెంట్‌ను నియమించుకునే అవకాశం కల్పిస్తాయి.
- నైపుణ్యాలకు ఉన్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడతాయి.
ఉద్యోగ ప్రామాణికతను మెరుగుపరుస్తాయి. - సమకాలీన అవసరాలకు అనుగుణంగా హెచ్-1బీ పథకంలో మార్పులు చేయడం ద్వారా అమెరికన్ ఆవిష్కరణలకు, ఆర్థిక ప్రగతికి ఊతమివ్వడమే ఈ మార్గదర్శకాల ప్రధాన లక్ష్యం.
DHS కార్యదర్శి ఏమంటున్నారంటే..
అమెరికన్ కంపెనీలు అత్యున్నత ప్రతిభావంతులను నియమించుకోవడానికి హెచ్-1బీ వీసా పథకం అత్యంత ముఖ్యమైనది. ఈ మార్పులు కంపెనీలకు మరింత స్వేచ్ఛనిచ్చి, ఆర్థిక పోటీతత్వాన్ని మెరుగుపరుస్తాయి’ అని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి అలెజాండ్రో మాయోర్కాస్ అన్నారు. అలాగే కొత్త ఆవిష్కరణలకు ఇవి దోహదపడాయని అంటున్నారు.
అమెరికా ఆర్థిక వృద్ధికి కీలకం : USCIS డైరెక్టర్
‘హెచ్-1బీ పథకం 1990లో రూపొందించబడింది. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వృద్ధికి అనుగుణంగా దీన్ని ఆధునీకరించడం అవసరం. ఈ మార్పులు కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలున్న ఉద్యోగులను సులభంగా నియమించుకునే అవకాశం కల్పిస్తాయి’ అని USCIS డైరెక్టర్ ఉర్ ఎం. జద్దౌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
H-1B visa వీసాల పరిమితి
కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఏడాది 65,000 హెచ్-1బీ వీసాలు మాత్రమే అందుబాటులో ఉంటాయని DHS తెలపింది. అదనంగా ఉన్నత విద్యార్హతలున్నవారికి 20,000 వీసాలు కేటాయిస్తారని పేర్కొంది. అయితే.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు , ప్రభుత్వ పరిశోధనా సంస్థలు ఈ పరిమితికి మినహాయింపును పొందొచ్చని వివరించింది. హెచ్-1బీ వీసాల సంఖ్యకు మించి దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో లాటరీ విధానం ద్వారా ఎంపిక జరుగుతుందని తెలిపింది. పూర్తి మినహాయింపు ఉన్న సంస్థలు ఏ సమయానికైనా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.
హెచ్-1బీ వీసాలపై కొత్త మార్గదర్శకాలు 2025 జనవరి 17 నుంచి అమల్లోకి రానుంది. ఇందులో భాగంగా కొత్త I-129 ఫారాన్ని ప్రవేశపెట్టనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..
1 Comment
[…] మరియు 2019 మధ్య టెస్ట్ క్రికెట్లో భారతదేశం అగ్రస్థానానికి చేరుకోవడంలో అశ్విన్ […]