Amit Shah AP Tour : కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పర్యటిస్తున్నారు. ఆయన టూర్ రెండు రోజులపాటు కొనసాగనుంది. నిన్న రాత్రి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న అమిత్‌షా (Amit Shah)కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితోపాటు ఇతర టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ భేటీలు, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపుల ప్రారంభం వంటి కార్యక్రమాలతో అమిత్ షా పర్యటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
భారీ భద్రత నడుమ
కేంద్ర హోం శాఖ మంత్రి (Minister of Home Affairs) అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసు శాఖ దాదాపు 1,200 మంది భద్రతా సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఆయన ఉండవల్లి చేరే మార్గంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎన్‌ఐడీఎం, ఎన్డీఆర్‌ఎఫ్ క్యాంపుల ప్రారంభం
గన్నవరంలో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందనా దళం (SDRF) క్యాంపులను కేంద్ర మంత్రి అమిత్‌షా ఈ రోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అమిత్ షా మాట్లాడుతూ విపత్తు నిర్వహణలో భారతదేశం గ్లోబల్ స్థాయిలో నిలవడం గర్వకారణమని అన్నారు.
రాష్ట్ర అభివృద్ధిపై Amit Shah చర్చలు
అమిత్‌షాకు చంద్రబాబు (Chandrababu Naidu) తన నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ప్రత్యేకంగా పెండింగ్ ప్రాజెక్టులు, విభజన హామీల అమలుపై కేంద్రం నుంచి మరింత సహకారం అందించాలని అమిత్‌షాకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఎన్టీఆర్‌కు భారతరత్నఇవ్వాల్సిందే..
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ సేవలను గుర్తు చేస్తూ ఆయనకు భారతరత్న అందించాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి అమిత్‌షా (Amit Shah) కు సీఎం చంద్రబాబు వివరించారు. ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో చేసిన సేవలు, తెలుగుదేశం పార్టీ స్థాపనతో దేశ రాజకీయాల్లో తెచ్చిన మార్పు, తెలుగు ప్రజల గౌరవాన్ని పెంచడంలో పోషించిన పాత్రను చంద్రబాబు వివరించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా భావసారూప్యత గల పార్టీలను జాతీయ స్థాయిలో ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్‌ది అని గుర్తు చేశారు. ఇదే సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ అమిత్‌షాకు వినతిపత్రం అందజేశారు. ఈ ఇద్దరు నేతల విజ్ఞప్తులపై అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. ఎన్టీఆర్ గొప్ప నేతని, భారతరత్నకు ఆయన అన్నివిధాలా అర్హులని అభిప్రాయపడ్డారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై హామీ
కేంద్ర మంత్రి అమిత్‌షా తన పర్యటన సందర్భంగా విశాఖ ఉక్కు ప్లాంట్‌కు కేంద్రం రూ.11,140 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్లాంట్‌ను లాభదాయకంగా మార్చడంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని సూచించారు. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశమని అభిప్రాయపడ్డారు. అందుకే ఈ ప్యాకేజీని ప్రకటించామని తెలిపారు. స్టీల్ ప్లాంట్‌కు మంచి భవిష్యత్తు ఉందని, సమష్టిగా కృషిచేసి లాభాల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.
కూటమి నేతల సమావేశం
అమరావతి వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఎన్డీఏ నేతల కీలక సమావేశం జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో అమిత్‌షా డిన్నర్ మీటింగ్ గంటన్నర సేపు కొనసాగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సహా పలువురు మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ప్రత్యేకంగా నదీ జలాల వివాదాలు, భూవినియోగం, రైతు సంక్షేమం వంటి అంశాలపై అమిత్ షా, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.









1 Comment
[…] రౌండ్‌టేబుల్ సమావేశాల్లో పాల్గొన్న చంద్రబాబు నాయుడు ఆర్గానిక్ వ్యవసాయం, మానవ […]