Employment for women : మహిళా సాధికారతపై ఫోకస్ పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. ఇందుకు ప్రముఖ బైక్ ట్యాక్సీ సేవల కంపె నీ రాపిడో (Rapido)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులైన మహిళలకు ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ (driving licence) కలిగి ఉన్న వారికి రాపిడో ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రయాణికుల సేవలను అందించేలా ఈ స్కీమ్‌ను ప్లాన్ చేశారు.
విశాఖ, విజయవాడలో అంకురార్పణ
ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ మొదటగా విశాఖపట్నం, విజయవాడలో దీన్ని ప్రారంభించనున్నారు. ఈ రెండు నగరాల్లో సుమారు 400 ఈ-బైక్‌లు, ఈ-ఆటోలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ తర్వాత కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు వంటి పట్టణాలకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు. ఈ చిన్న పట్టణాల్లో కలిపి మరో 200 వాహనాలు అందుబాటులోకి తీసుకురానున్నారు.
Employment for women : రుణాల ద్వారా వాహనాలు సొంతం
ఈ పథకం కింద మహిళలు వాహనాలను సొంతంగా కొనుగోలు చేసేందుకు ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించనుంది. ప్రత్యేకంగా ముద్రా యోజన, ఇతర స్వయం ఉపాధి పథకాల ద్వారా రుణ సదుపాయాలు కల్పించనున్నారు. దీని వల్ల మహిళలు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు తీసుకొని వాహనాలను సొంతం చేసుకోవచ్చు. దీని వల్ల వారు రాపిడో సేవల ద్వారా తాము సంపాదించుకునే ఆదాయంతో రుణాన్ని సులభంగా తీర్చుకునే అవకాశం ఉంటుంది.
మూడు నెలలపాటు ఉచితంగానే..
రాపిడో కంపెనీ (taxi service company Rapido)తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఈ-బైక్ (e-bikes) లేదా ఈ-ఆటో (e-autos) నడిపే మహిళా డ్రైవర్లకు మొదటి మూడు నెలల పాటు ప్లాట్‌ఫారమ్ చార్జీలు మినహాయించనున్నారు. అంటే.. ఈ కాలంలో వారు రాపిడో యాప్ ద్వారా ప్రయాణికుల సేవలు అందించినా ఎటువంటి అదనపు చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. మూడు నెలల తర్వాత రాపిడో ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించుకోవడానికి మహిళలు నెలకు రూ.1,000 చెల్లించాల్సి ఉంటుంది. తద్వారా ఈ-బైక్ లేదా ఈ-ఆటో నడిపే ప్రతి మహిళా డ్రైవర్‌కూ నెలకు కనీసం 300 రైడ్లు అందేలా ర్యాపిడో ప్రణాళికను రూపొందించింది.
పేదరికంలో అండగా..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాపిడో సహకారంతో చేపట్టిన ఈ కొత్త పథకం మహిళలకు ఆర్థిక స్వావలంబన ( AP Employment for women ) అందించడంలో కీలకంగా మారనుంది. స్వయం ఉపాధి (self-employment programmes)ని పెంచడం, ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం వంటి ప్రయోజనాలతో ఈ పథకం మహిళల జీవితాలలో సానుకూల మార్పులు తీసుకురావడం ఖాయమనే అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ పథకం ద్వారా వేలాది మంది మహిళలకు ఉపాధి లభించనుంది. ముఖ్యంగా పేద కుటుంబాలకు చెందిన మహిళలు, చదువు మధ్యలో ఆపేసిన వారు, తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








