Sarkar Live

Polavaram project | పోలవరం ప్రాజెక్టుపై కీలక అప్ డేట్

CM inspects Polavaram project : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu) ఈ రోజు పోలవరం ప్రాజెక్టు (Polavaram project)ను సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు పనులను

Polavaram project

CM inspects Polavaram project : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Andhra Pradesh Chief Minister Nara Chandrababu Naidu) ఈ రోజు పోలవరం ప్రాజెక్టు (Polavaram project)ను సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు పనులను సమర్థంగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమాలోచనలు చేశారు. డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్, ఇతర నిర్మాణ పనులపై దృష్టి సారించారు. భూనిర్వాసితులతో స‌మావేశ‌మై, వారి స‌మ‌స్య‌లు విన్నారు.

Polavaram project : ప్రాజెక్టుపై వైమానిక సర్వే

చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా ప్రాజెక్ట్ పై వైమానిక సర్వే (aerial view) నిర్వహించారు. ప్రాజెక్ట్ (Polavaram project) నిర్మాణ పురోగతిని సమగ్రంగా అంచనా వేసిన అనంతరం నిర్మాణ స్థలాన్ని స్వయంగా సందర్శించారు. ప్రాజెక్ట్ ప్రధాన భాగాలు, నీటి నిల్వ సామర్థ్యం, నదీ ప్రవాహ మార్గం, నిర్మాణంలో ఎదురవుతున్న సవాళ్లపై అధికారులతో చర్చించారు.

భూనిర్వాసితుల స‌మ‌స్య‌ల‌పై దృష్టి

భూనిర్వాసితులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ప్రాజెక్టు (Polavaram project) నిర్మాణం వల్ల బాధితులైన గ్రామస్థులతో మాట్లాడి, వారికి సరైన పునరావాసం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. నిర్వాసితుల అభ్యర్థనల మేరకు పునరావాస ప్యాకేజీ మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

డయాఫ్రమ్ వాల్, కాఫర్ డ్యామ్ పరిశీలన

చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu ) ప్రత్యేకంగా డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. ఈ వాల్ నిర్మాణం ప్రాజెక్ట్ స్థిరత్వానికి ఎంతో ముఖ్యమైనదని ఆయన గుర్తు చేశారు. పనుల నాణ్యత విషయంలో రాజీపడకూడదని అధికారులను ఆదేశించారు. కాఫర్ డ్యామ్ నిర్మాణంలో ఏమైనా జాప్యాలు ఉన్నాయా? అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు.

పనుల వేగవంతం చేయాల‌ని ఆదేశాలు

Polavaram project పరిశీలన అనంతరం చంద్రబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశించిన గడువులో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా, ప్రాజెక్ట్ పనుల కోసం నిధుల కేటాయింపు, నిర్వహణ, పనుల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమ‌ని సీఎం (Chandrababu Naidu) పేర్కొన్నారు. ఇది పూర్తయితే రాష్ట్రానికి తాగునీరు, సాగునీటి సమస్యలు చాలా వరకు తీరుతాయని చెప్పారు. ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం కాకుండా, పనులు ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

More Posts

Web Stories

error: Content is protected !!
Rajma | ఇలాంటి సమస్యలున్నవారు రాజ్మా తినడం ప్రమాదమే! Nirgundi | వావిలి మొక్కలు దివ్యమైన ఔషధ గుణాలు.. Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?