Apple Intelligence : టెక్నాలజీ ప్రపంచంలో మరో సంచలన మార్పునకు ఆపిల్ సిద్ధమైంది. వ్యక్తిగత సహాయాన్ని అందించే అత్యాధునిక ఇంటెలిజెన్స్ సిస్టం ఆపిల్ ఇంటలిజెన్స్ ఇప్పుడు మరిన్ని భాషల్లో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా భారతదేశం కోసం ప్రత్యేకంగా లోకలైజ్డ్ ఇంగ్లిష్ వెర్షన్ కూడా విడుదల కానుంది.
Apple Intelligence : ఎప్పటి నుంచి అంటే..
ప్రపంచవ్యాప్తంగా iOS 18.4, iPadOS 18.4, macOS Sequoia 15.4 అప్‌డేట్‌ల ద్వారా ఆపిల్ ఇంటెలిజెన్స్ సిస్టం అందుబాటులోకి రానుంది. 2024 ఏప్రిల్ నెలలో ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను ఆపిల్ విడుదల చేయనుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ సిస్టం ద్వారా కొత్తగా ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, పోర్చుగీస్ (బ్రెజిల్), స్పానిష్, జపనీస్, కొరియన్, సింప్లిఫైడ్ చైనా భాషలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాదు.. భారతదేశం, సింగపూర్ ప్రత్యేకంగా లోకలైజ్డ్ ఇంగ్లిష్ వెర్షన్ కూడా విడుదల అవుతుంది.
అక్కడి వినియోగదారులకు ప్రీమియం ఫీచర్లు
యూరోపియన్ యూనియన్ (EU) దేశాల్లో iPhone, iPad వినియోగదారులకు మొదటిసారిగా Apple Intelligence సేవలు అందుబాటులోకి రానున్నాయి. అదనంగా Apple Vision Pro కోసం U.S. English భాషలో Apple Intelligence ప్లాట్‌ఫామ్‌ను విస్తరించనుంది. దీని వల్ల యూజర్లు కొత్త మార్గాల్లో ఆలోచనలు పంచుకోవచ్చు. తమ భావాలను మెరుగ్గా వ్యక్తీకరించొచ్చు.
Apple Intelligence – ప్రైవసీ పరంగా విప్లవాత్మక ముందడుగు
Apple Intelligence ను పూర్తిగా ప్రైవసీ దృష్టితో డిజైన్ చేశారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉండేలా ప్రత్యేకమైన టెక్నాలజీని ఉపయోగించారు. ముఖ్యంగా ఇందులో ఉన్న ఆన్ డివైస్ ప్రాసెసింగ్ వ్యక్తిగత సమాచారాన్ని సురక్షితంగా ఉంచేందుకు కీలకంగా పనిచేస్తుంది. అనేక ఇంటెలిజెన్స్ మోడళ్లు డివైస్‌లోనే పనిచేస్తాయి. తద్వారా యూజర్ డేటా సురక్షితంగా ఉంటుంది.
అలాగే ఇందులో ప్రైవేట్ క్లౌడ్ కంప్యూట్ (PCC) పెద్ద AI మోడళ్లకు అవసరమైన ప్రాసెసింగ్‌ను ప్రైవేట్ క్లౌడ్ ద్వారా నిర్వహించి, అత్యధిక భద్రతను అందిస్తుంది. ఈ విధంగా ఆపిల్ ఇంటెలిజన్స్ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచేలా ప్రత్యేకమైన టెక్నాలజీలను అనుసరిస్తుంది.
ఆపిల్ ఇంటెలిజెన్స్‌లోని Siri సహాయ వ్యవస్థను మరింత మెరుగుపరిచేలా పనిచేస్తోంది. కొత్త అప్‌డేట్‌ల ద్వారా మరింత తెలివైన సమాధానాలు ఇస్తుంది. సమాచారాన్ని వేగంగా అర్థం చేసుకుని స్పందిస్తుంది. కొత్త ప్రొంప్ట్‌ల ద్వారా విభిన్న సమాచారం అందిస్తుంది.
Apple Vision Pro లో కూడా Apple Intelligence
Apple Vision Pro డివైస్‌లకు కూడా 2024 ఏప్రిల్ నుంచి ఆపిల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రానుంది. ఇందులోని Writing Tools ద్వారా టెక్స్ట్ ప్రూఫ్‌రీడింగ్, రీ రైటింగ్, సారాంశాన్ని రూపొందించుకోవడం లాంటివి ఈజీగా చేసుకోవచ్చు. చాట్‌జీపీటీ తో సహకారంతో టెక్స్ట్‌ను పూర్తిగా కొత్తగా రూపొందించుకోవచ్చు. మీ భావోద్వేగాలకు తగ్గట్లుగా ప్రత్యేకమైన ఎమోజీలు రూపొందించుకోవచ్చు. అలాగే సృజనాత్మకమైన గ్రాఫిక్స్ రూపొందించుకోవచ్చు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..