Appointments for SGT posts : తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఊరటనిచ్చింది. ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT)గా రాష్ట్ర ప్రభుత్వం వీరిని నియమిస్తోంది. 1,382 మంది ఈ పోస్టుల్లో భర్తీ అవుతున్నారు. తాజాగా వీరికి ప్రభుత్వం అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ జారీ చేసింది. పూర్తిగా ఒప్పంద ప్రాతిపదిక (contractual basis)న వీరి సేవలను వినియోగించుకోనుంది. రూ. 31,040 వేతనంతో ఈ టీచర్లు పనిచేయనున్నారు.
Appointments for SGT posts .. ఎట్టకేలకు పరిష్కారం
DSC-2008 అభ్యర్థుల సమస్య 16 ఏళ్ల అనంతరం పరిష్కారమైంది. ఎంపిక విధానంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఎస్జీటీ పోస్టుల్లో అభ్యర్థులు అప్పట్లో నియామకం పొందలేకపోయారు. దీంతో ఇది వివాదాస్పదంగా మారింది. అప్పటి నుంచి ఈ సమస్యకు పరిష్కారం లభించలేదు. ఎట్టకేలకు సుదీర్ఘకాలం తర్వాత మోక్షం కలిగింది. డీఎస్సీ 2008 అభ్యర్థులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎస్జీటీ పోస్టుల్లో భర్తీ చేస్తూ అపార్ట్‌మెంట్ లెటర్లు జారీ చేశారు.
అప్పట్లో వివాదం ఏమిటంటే..
2008 DSC నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్మీడియట్ + D.Ed లేదా డిగ్రీ + B.Ed అర్హత కలిగి ఉండాలి. తొలుత 30 శాతం కోటాను D.Ed అభ్యర్థులకు అప్పటి ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 70 శాతం SGT పోస్టులను D.Ed, B.Ed అభ్యర్థులతో కామన్ మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలని నిర్ణయించింది. దీనిపై B.Ed అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ మార్పుల వల్ల B.Ed అభ్యర్థులు ఎంపిక కాకపోవడం పెద్ద వివాదంగా మారింది. ఈ క్రమంలో ఆ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు డీఎస్సీ ద్వారా ఉద్యోగావకాశం కల్పించాలని కోరారు. దీంతో 2023లో హైకోర్టు తీర్పును ఇస్తూ B.Ed అభ్యర్థులకూ అవకాశమివ్వాలని ఆదేశించింది. అయితే.. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) నిబంధనల ప్రకారం B.Ed అభ్యర్థులు SGT ఉద్యోగాలకు అనర్హులు. ఈ వివాదం సుప్రీం కోర్టు దాకా వెళ్లింది. అయినా మానవతా దృక్పథంతో B.Ed అభ్యర్థులను ఎస్జీటీలుగా ప్రభుత్వం అవకాశం ( DSC Appointments ) కల్పిస్తోంది. దీంతో 18 ఏళ్ల తర్వాత తమకు ఉద్యోగావకాశం రానుండటంతో డీఎస్సీ 2008 బీఈడీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..








