Army Agniveer Recruitment Rally | హైదరాబాద్: తెలంగాణ నుంచి అగ్నివీర్ నియామకాల కోసం ఇండియన్ ఆర్మీ డిసెంబర్ 8 నుంచి 16 వరకు గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, , పుదుచ్చేరి లోని మహిళా మిలిటరీ పోలీసుల (డబ్ల్యుఎంపి)ని కూడా ఎంపిక చేసేందుకు ర్యాలీ నిర్వహించనున్నారు. .
పోస్టుల వివరాలు
- అభ్యర్థులు అగ్నివీర్- జనరల్ డ్యూటీ,
- అగ్నివీర్ టెక్నికల్,
- అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్,
- అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (X క్లాస్ పాస్),
- అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ (తరగతి VIII పాస్)
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ ఉద్యోగాలకు అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక అగ్నివీర్ ట్రెడ్స్ మెన్‌కు కేవలం 8వ తరగతి ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది. ర్యాలీకి అడ్మిట్ కార్డులు పొందిన అభ్యర్థులు నోటిఫికేషన్ ప్రకారం అన్ని పత్రాలతో ర్యాలీ స్థలానికి తీసుకెళ్లాలని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ గా, పారదర్శకంగా ఉంటుంది. అభ్యర్థులు అగ్నివీర్ ఉద్యోగాల భర్తీ విషయంలో మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నియామక ప్రక్రియలో ఏజెంట్లకు ఎటువంటి పాత్ర ఉండదు. అభ్యర్థులు అటువంటి ఏజెంట్లు లేదా ఏజెన్సీలను ఆశ్రయించవద్దని సూచించారు. అభ్యర్థులు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ఆఫీస్, సికింద్రాబాద్, (టెలిఫోన్ నంబర్ 040-27740059 మరియు 27740206) నుండి అన్ని రిక్రూట్‌మెంట్ సంబంధిత సందేహాలను స్పష్టం చేయవచ్చు.
1 Comment
[…] పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువ భారత్ 36 ఓవర్లలో 139 పరుగులకు […]