8th Pay Commission Approval : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్లకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. లక్షలాది మంది ఉద్యోగుల జీతాలు, రిటైర్డ్ ఉద్యోగుల పింఛన్లను పెంచేందుకు గాను 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో న్యూదిల్లీలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకంది. కేబినెట్ సమావేశానికి సంబంధించిన నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnav) మీడియాకు వెల్లడించారు.
“1947 నుంచి ఇప్పటివరకు 7 వేతన సంఘాలు ఏర్పాటయ్యాయని, ఎలాంటి జాప్యానికి అవకాశం లేకుండా వేతన సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి మోదీ నిర్ణయించారని కేంద్ర మంత్రి అశ్వనీవైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న పే కమిషన్ 2016లో ఏర్పాటయింది. ఆ వేతన సంఘం గడువు 2026లో ముగుస్తుందని చెప్పారు. అయితే ఆ నిర్ణీత గడువుకు ముందుగానే 2025లోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చేయడం ద్వారా సరిపడా సమయం లభిస్తుందని పేర్కొన్నారు. కొత్త కమిషన్‌కు ఛైర్మన్, ఇద్దరు సభ్యులను త్వరలోనే నియమిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలనేదానిపై వేతన సంఘం కీలక పాత్ర పోషిస్తుంచనుంది.. దేశంలో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న వేతనాలు పెన్షన్లను ఎంత వరకు పెంచాలనే అంశాలపై ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఈ నివేదిక ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపట్టనుంది.
8th Pay Commission : మోదీ ఏమన్నారంటే..
8th Pay Commission : 8వ వేతన సంఘం ఆమోదంపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఎక్స్ వేదికగా స్పందించారు. ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుకు ఎన్‌డిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉద్యోగుల జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందని తెలిపారు. ‘విక్షిత్ భారత్’ నిర్మాణానికి కృషి చేసే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని ప్రధాని మోదీ అన్నారు.
దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, 65 లక్షల మంది పెన్షనర్ల అలవెన్సులను సవరించేందుకు 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది.
“విక్షిత్ భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరి పట్ల మనమందరం గర్విస్తున్నాం. 8వ వేతన సంఘంపై క్యాబినెట్ నిర్ణయం జీవన నాణ్యతను మెరుగుపరుస్తుందిఅని ప్రధాని మోదీ X లో పోస్ట్ చేశారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..