Atul Subhash Suicide : బెంగళూరులో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్యపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది సోషల్ మీడియాలో ఇప్పుడు #JusticeForRishi #JusticeForAtulSubhashతో Xలో ట్రెండింగ్ అవుతోంది రిషి త్రివేది కూడా సుభాష్ మాదిరిగానే డిసెంబరు 27, 2023న ఆత్మహత్య చేసుకుని మరణించాడని అతని సోదరుడు ఓమ్జీ త్రివేది తెలిపిన ప్రకారం, అతని భార్య “భావోద్వేగ వేధింపుల” కారణంగా మరణించాడు. అని తాజాగాపేర్కొన్నాడు.
అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు అతని సోదరుడి విషయంలో ఎలా ఉన్నాయో వివరిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. “అతుల్ సుభాష్ లాగానే, నా సోదరుడు కూడా అతని భార్య శిఖా అవస్తి వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 27, 2023 న, ఆమె క్రూరత్వాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు,” అని ఓమ్జీ ఒక X పోస్ట్‌లో రాశారు. .
అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు
అతుల్ సుభాష్ 24 పేజీల నోట్‌లో తన విడిపోయిన భార్య నికితా సింఘానియా రూ.2 నుంచి 4 లక్షల వరకు భరణం డిమాండ్ చేస్తుస్తోందని, తన కొడుకు చూపించకుండా కోర్టు అవసరాల కోసం తన నాలుగేళ్ల కొడుకును ఉపయోగించుకుంటున్నారని, తనను తన కుటుంబాన్ని అవమానపాలు చేస్తున్నారని సుసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
తనకు న్యాయం జరిగే వరకు అస్థికలను నిమజ్జనం చేయవద్దని సుభాష్ ఆ నోట్‌లో పేర్కొన్నారు. “న్యాయం చేయలేకపోతే నా అస్థికలను కోర్టు ముందు పడేయాలని, తద్వారా ఈ దేశంలో మనిషి జీవితం ఎలా ఉందో అని ప్రజలకు అర్థమవుతుంది” అని ఆయన రాశారు.
“నేను ఈ సూసైడ్ నోట్‌ను మంచి మనస్సుతో రాస్తున్నాను. వేధింపులు, దోపిడీల వల్ల నేను ఈ రోజు ఆత్మహత్య చేసుకుంటున్నాను” అని అతను రాశాడు. తనను వేధించిన అతను తన భార్య, అతని అత్తమామలు, ఫ్యామిలీ కోర్టు జడ్జి (యుపి) సహా ఐదుగురి పేర్లను సుసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి. అలాగే మా ఫేస్ బుక్, వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్) ను ఫాలో అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..