Allu Arjun | ఆర్య 2 రీ రిలీజ్ లో రికార్డులు బ్రేక్ చేస్తుందా..?
Allu Arjun | టాలీవుడ్ లో రీ రిలీజ్ ల హవా నడుస్తోంది. బడా హీరోల సూపర్ హిట్ మూవీలను మళ్లీ రిలీజ్ చేస్తే ఆడియన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ రిలీజ్ అవుతున్న మూవీల కంటే వారి పాత సినిమాలే ఫ్యాన్స్ ని అలరిస్తున్నాయి. అప్పటి పాటలు థియేటర్లో వస్తుంటే ఆడియన్స్ కూడా పాడుతూ, డ్యాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పట్లో డిజాస్టర్ అయిన మూవీస్ కూడా రీ రిలీజ్ చేస్తే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంటున్నాయి.
ఆ మూవీలను అప్పుడు థియేటర్లో చూడని వారికి కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. ఈసారి థియేటర్ లో మూవీని చూసే ఛాన్స్ ను మిస్ చేసుకోవద్దని వెంటనే టికెట్స్ ని బుక్ చేసుకుంటున్నారు. కొత్తగా రిలీజ్ అయిన మూవీస్ కంటే ఈ మూవీస్ ని చూడడాని కే ఆడియన్స్ ఫస్ట్ ప్రియార్టీ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు (Pawan Kalyan and mahesh babu movies) మూవీస్ రీ రిలీజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. వారి మూవీల ...




