OG Movie Review : వింటేజ్ పవన్ కళ్యాణ్ మాస్ ఫీస్ట్!
                    OG Movie Review  ఓజీ మూవీ రివ్యూ : కొంతకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ ఫీవర్ తో ఊగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఎక్కడికెళ్లినా ఓజీ.. ఓజీ అని అరుస్తూనే ఉన్నారు. పవన్ వరుస ఫ్లాప్ ల తరవాత హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ మూవీ ఈరోజు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది. పవర్ స్టార్ ఫ్యాన్ బాయ్ సుజీత్ డైరెక్షన్ లో సుజీత్ సినిమాటిక్ యూనివర్స్ లో (SCU) భాగంగా డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం…..
స్టోరీ…
జపాన్ లో ఉండే ఓజాస్ గంభీరా (Pawan Kalyan)ఒక దాడి వల్ల ఇండియాకు వస్తాడు. అక్కడ ఒక సిట్యువేషన్ లో సత్య దాదా(Prakash Raj)ను కాపాడతాడు. ఆ తర్వాత వారిద్దరూ బొంబాయి చేరుతారు. అక్కడ సత్యదాదా డాన్ గా ఎదగగా, అతడి కింద ఓజాస్ ఉంటాడు. కొన్ని కారణాల వల్ల ఓజాస్ గంభీరా బొంబాయి వీడి నాసిక్ చేరుతాడు. అక్కడ కన్మణి (Priyanka moha...                
                
             
								



