Nayanthara | మలయాళ మెగాస్టార్ తో లేడీ సూపర్ స్టార్
Mollywood film industry News | లేడీస్ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయినా హీరోయిన్ గా అవకాశాలు ఏ మాత్రం తగ్గలేదు. రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో అగ్రకథానాయికగా వెలుగొందుతోనే ఉంది. అన్ని భాషల్లో అందరూ అగ్ర హీరోలతో నటించి బెస్ట్ జోడీ అనిపించుకుంది. అలాగే ఇండస్ట్రీలో తన జూనియర్లతో కూడా నటించి నయన్ బెస్ట్ ఫెయిర్ గా నిలిచింది.
నయన్ లుక్స్, తన గ్లామర్, ఫిజిక్ అటు సీనియర్ హీరోలకు, ఇటు జూనియర్ హీరోల పక్కన చక్కగా సరిపోతుంది. కెరియర్ స్టార్టింగ్ లో యాంకర్ గా మొదలుపెట్టి హీరోయిన్ గా ఎదిగిన నయన్ అప్పటి నుండి ఇప్పటి వరకు తన కెరీర్లో వెనుదిరి చూసుకోలేదు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ దూసుకుపోయింది.ఇప్పుడు కొత్తగా వస్తున్న కుర్ర హీరోయిన్లకు పోటీగా వరుసగా సినిమాల పై సంతకాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాల...



