Vishnuvardhan | ఆ రోజుల్లో చేసిన పనులను పబ్లిక్ గా చెప్పలేను..
డైరెక్టర్ విష్ణువర్ధన్ (Vishnuvardhan)అజిత్ బిల్లా, ఆట ఆరంభం లాంటి మూవీస్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో పంజా మూవీ తీసి స్టైలిష్ డైరెక్టర్ అని అనిపించుకున్నాడు. చాలా సంవత్సరాల తర్వాత ప్రేమిస్తావా(premisthava) అనే మూవీని డైరెక్ట్ చేశాడు. తమిళంలో రిలీజ్ అయి మంచి హిట్ అయిన ఈ మూవీ ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఆయన పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. మహేష్ బాబు(Mahesh babu)తో తను చదువుకునే రోజుల్లో చేసినటువంటి అల్లరి పనులను చెప్పారు.
చదువుకునే రోజుల్లో అందరూ అల్లరి పనులు చేస్తుంటారు. అందులో ఇప్పుడు స్టార్ లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా చదువుకున్న టైమ్ లో అల్లరి,తుంటరి పనులు చేసే ఉంటారు. వారి విషయాలు ఎక్కువగా బయటికి రావు.ఎవరో వారితో కలిసి చదువుకున్న వారు ఏదో ఒక సందర్భంలో చెబితే తప్ప త...




