Hit -4 Movie | హిట్ -4 లో మాస్ మహారాజా.. నిజమేనా..?
                    Hit -4 Movie | నేచురల్ స్టార్ నాని (Natural star Nani) హీరోగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా ఇండస్ట్రీలో తనదైన మార్క్ ని చూపెడుతున్నారు. తను హీరోగా వచ్చిన గత చిత్రం సరిపోదా శనివారం ఆగస్టులో రిలీజ్ అయి మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. వివేకా ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కొంత మంది ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇందులో నాని యాక్టింగ్, ఎస్ జె సూర్య విలన్ రోల్ లో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశారు. అంతకుముందు దసరా, హాయ్ నాన్న లాంటి మూవీస్ తో నాని హిట్టు కొట్టారు.
ఒకపక్క హీరోగా చేస్తూనే మరోవైపు మంచి స్టోరీస్ వింటూ వాటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అందులో విశ్వక్సేన్ హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్లో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై 2020లో హిట్ (Hit ) అనే మూవీ తెరకెక్కింది. డైరెక్టర్ గా శైలేష్ కొలనుకి (Shailesh kolanu) ఇదే మొదటి సినిమా. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గా వచ్చిన ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. దీనికి కొనస...                
                
             
								



