Ravi Teja | థ్రిల్లర్ మూవీ లో మాస్ మహారాజా…?
మాస్ మహారాజా రవితేజ (mass Maharaja Ravi Teja)హిట్టు ప్లాప్ లతో తేడా లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.మెగాస్టార్ చిరు (Megastar Chiranjeevi)తో యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య(vaalteru veerayya) మూవీ హిట్ తరవాత ఇంకో హిట్టు కొట్టలేదు. ఆ మూవీ లో చిరు మెయిన్ రోల్ కాబట్టి ఆ హిట్టు రవితేజది ఒక్కడిదే కాదు. సోలో గా త్రినాథ రావు నక్కిన (Trinath Rao nakkina)డైరెక్షన్ లో వచ్చిన ధమాకా (dhamaka)తో లాస్ట్ హిట్టు కొట్టాడు.
ఆ తర్వాత రావణసుర, టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకదానికి మించి మరొకటి వరుస ఫ్లాఫ్ లు అయ్యాయి.ప్రజెంట్ భాను బోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర(mass jathara) మూవీ సెట్స్ పై ఉంది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
ధమాకా లాంటి సూపర్ హిట్టు మూవీ తరవాత శ్రీలీల, రవితేజ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా...




