Man murdered | రీహాబిలిటేషన్ సెంటర్‌లో దారుణం.. సహచరుల దాడిలో ఒకరి హతం
Miyapur Murder Case : హైదరాబాద్ మియాపూర్ (Miyapur) ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రీహాబిలిటేషన్ సెంటర్ (rehabilitation centre )లో ఘోర ఘటన సంఘటన చోటుచేసుకుంది. మాదక ద్రవ్యాల వ్యసనానికి చికిత్స పొందుతున్న ఓ వ్యక్తిని అదే సెంటర్‌లోని ఇద్దరు సహచరుల చేతిలో హత్యకు గురైనట్టు వెలుగులోకి వచ్చింది.ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) కు చెందిన సందీప్ మాదక ద్రవ్యాలకు అలవాటు పడి (addicted to drug) వ్యసనపరుడిగా మారాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు సుమారు తొమ్మిది నెలల క్రితం హైదరాబాద్‌లోని రీహాబిలిటేషన్ సెంటర్‌లో చేర్పించారు. మాదక ద్రవాలను వీడి అతడు సాధారణ జీవితాన్ని గడుపుతాడని భావించారు. ఇదే క్రమంలో నల్లగొండ జిల్లా (Nalgonda district)కు చెందిన ఆదిల్, హైదరాబాద్ బార్కస్‌కు చెందిన సులేమాన్ కూడా మూడు నెలల క్రితం ఈ రీహాబిలేషన్ సెంటర్‌లో చికిత్స కోసం చేరారు. బుధవారం రాత్రి సందీప్‌తో ఆదిల్, సులేమ...




