Sarkar Live

Author: Maulika

vaccination| వ్యాక్సిన్ వేయ‌గానే శిశువు మృతి
Crime

vaccination| వ్యాక్సిన్ వేయ‌గానే శిశువు మృతి

Boy dies after vaccination : వాక్సిన్ తీసుకున్నగంట వ్య‌వ‌ధిలోనే నాలుగు నెల‌ల శిశువు మృతి చెందిన (boy dies) సంఘ‌ట‌న కరీంనగర్ జిల్లా జ‌మ్మికుంట (Jammikunta) మండ‌లం పాప‌క్క‌ప‌ల్లిలో క‌ల‌క‌లం రేపింది. టీకా ప్రభావమేనా లేక వేరే కారణమా అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. వ్యాక్సిన్ (vaccine) వ‌ల్లే త‌మ బిడ్డ మృతి చెందాడ‌ని త‌ల్లిదండ్రులు ఆరోపిస్తుండ‌గా వైద్యులు మాత్రం కార‌ణం అది కాద‌ని అంటున్నారు. ఇత‌ర అనారోగ్య కార‌ణం వ‌ల్ల శిశువు మృతి చెంది ఉండొచ్చ‌ని వాదిస్తున్నారు. పాపక్కపల్లి గ్రామానికి చెందిన లింగాల అంజి, హర్షిత దంపతులు తమ నాలుగు నెలల బిడ్డను వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. శిశువుకు ఆరోగ్య శాఖ మార్గదర్శకాల ప్రకారం అక్క‌డి వైద్య సిబ్బంది RVV-2 (రోటా వైరస్ వ్యాక్సిన్), Penta-2 (డిఫ్తీరియా, టెటనస్, పెర్టుసిస్, హెపటైటిస్-బి, Hib కలిపిన టీకా) వేశారు. ఈ టీకాలు సాధారణంగా శిశువు...
Rains | నేడు ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
State

Rains | నేడు ఐదు జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక

Telagnana Rains | బంగాళాకాతంలో ఏర్ప‌డిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీవర్షాలు (Rains) కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చ‌రించింది. పలు జిల్లాల్లో కుండపోతగా వాన కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, సిరిసిల్ల, జగిత్యాల, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మానుకోట‌, పాల‌మూరు, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains ) కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఇక సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి పాల‌మూరు, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ జిల్లాలకు వాత...
రియో కార్నివ‌ల్ త‌ర‌హాలో బ‌తుక‌మ్మ‌.. అంత‌ర్జాతీయ స్థాయిలో వేడుక‌లు – Bathukamma festival
State, Hyderabad

రియో కార్నివ‌ల్ త‌ర‌హాలో బ‌తుక‌మ్మ‌.. అంత‌ర్జాతీయ స్థాయిలో వేడుక‌లు – Bathukamma festival

Bathukamma festival : బతుకమ్మ పండుగ ను అంత‌ర్జాతీయ స్థాయిలో పరిచయం చేయడానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ (Telangana tourism) ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. సెప్టెంబరు 21 నుంచి 30 వరకు జరిగే ఈ తొమ్మిది రోజుల పూల పండుగను ఈసారి మరింత వైభవంగా జరపాలని సంకల్పించింది. ఈ సారి కూడా బతుకమ్మ ఉత్సవం వ‌రంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి (Thousand Pillar Temple) వద్ద ప్రారంభమవుతుంది. ఈ ప్రదేశం తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలుస్తోంది. పూలతో అలంకరించిన బతుకమ్మలను మహిళలు పురాతన కట్టడాల మధ్య సమూహంగా ఆడుతూ పాడుతూ జరుపుకోవడం ఒక ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కొంగొత్త త‌ర‌హాలో Bathukamma festival బ‌తుక‌మ్మ ఉత్స‌వాల ((Bathukamma festival)ను ఈ సారి రియో కార్నివల్ తరహాలో నిర్వహించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Tourism minister Jupally Krishna Rao) తెలిపారు. ప్రపంచ పర్యాటక...
Betting racket : హైదరాబాద్‌లో భారీగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ గుట్టుర‌ట్టు
Cinema

Betting racket : హైదరాబాద్‌లో భారీగా ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ గుట్టుర‌ట్టు

Betting racket : హైదరాబాద్ నగరంలో అక్రమంగా నడుస్తున్న ఆన్‌లైన్ బెట్టింగ్ రాకెట్ (online betting racket) గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. కమిషనర్ టాస్క్‌ఫోర్స్, వెస్ట్‌జోన్ పోలీసులు ఘన్సీబజార్, పూరానాపుల్, షాలీబండ, హయత్‌నగర్ ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ఒక బుకీ (bookie), ఐదుగురు ఏజెంట్లు (agents), ఒక పంటర్ (punter)ను అరెస్టు చేశారు. 55 మొబైల్ ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, 60 డెబిట్ కార్డులు, భారీ నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆన్‌లైన్ బెట్టింగ్ పాయింట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తం విలువ రూ. 23,51,505 (ఒక పాయింట్ = ఒక రూపాయి). ఈ గ్యాంగ్ ప్రముఖ ఆన్‌లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫాంలు అయిన SKYEXCH, RADHE EXCHANGE, 99 RACES, 365 RACES, Placebet999 లాంటి యాప్‌ల ద్వారా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తూ డబ్బు సంపాదిస్తున్నట్టు బయటపడింది. అరెస్టయిన వారిలో బుకీల‌లో ఘన్సీబజార్ చార్మినార్ ప్...
Mahabubnagar : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువ‌కుడు మృతి
Crime

Mahabubnagar : అమెరికాలో పోలీసుల కాల్పుల్లో తెలంగాణ యువ‌కుడు మృతి

Mahabubnagar : అమెరికా (United States)లో జరిగిన ఓ ఘ‌ట‌న‌లో మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన యువకుడు పోలీసుల కాల్పుల కు గురై ప్రాణాలు (shot dead) కోల్పోయాడు. 15 రోజుల క్రితమే ఈ సంఘటన జరిగినప్పటికీ అతడి స్నేహితులు ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది.మహబూబ్‌నగర్ జిల్లా రమయ్యబౌళి ప్రాంతానికి చెందిన నిజాముద్దీన్ (34) 2016లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లాడు. చదువులు పూర్తయ్యాక కాలిఫోర్నియా (California)లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. నలుగురితో క‌లిసి ఓ రూమ్‌ను అద్దెకు తీసుకొని నివ‌సిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే రూమ్‌మేట్స్‌తో విభేదాలు ఉధృతమై చివరికి ప్రాణాంతక పరిణామానికి దారితీశాయి. రూమ్‌మేట్స్‌తో వాగ్వాదం.. పోలీసుల కాల్పులు కాలిఫోర్నియా (California) మీడియా కథనాల ప్రకారం.. నిజాముద్దీన్, అతడి రూమ్‌మేట్స్ మధ్య తీవ్ర వాగ్వాదం జ...
error: Content is protected !!