Next Gen GST | దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు
Next Gen GST : దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) ప్రకటించారు. నెక్ట్స్ జెన్ జీఎస్టీ (Next Gen GST) సంస్కరణలు (reforms) అమలులోకి వచ్చి రూ.2 లక్షల కోట్లు ఆర్థిక వ్యవస్థలోకి చేర్చబడ్డాయని ఆమె తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రజల జేబుల్లో మరింత డబ్బు మిగిలి సాధారణ కుటుంబాల ఖర్చులకు ఊరటనిచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఈ రోజు నిర్వహించిన Next Gen GST Reforms Outreach and Interaction Programలో ఆమె ప్రసంగించారు.
Next Gen GST : ప్రజల చేతుల్లో మిగులు డబ్బులు
పన్ను స్లాబ్‌లలో మార్పులు చేసి, ప్రజలకు ఆర్థికంగా ఊతం అందించామని నిర్మలా సీతారామన్ వివరించారు. గతంలో 12 శాతం జీఎస్టీ కింద ఉన్న వస్తువులలో 99 శాతం వస్తువులు ఇప్పుడు ఐదు శాతం స్లాబ్‌లోకి మ...




