Sarkar Live

Author: Maulika

Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య
Crime

Murder | ఇద్దరు మహిళల దారుణ హత్య

Janagama : జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలు దారుణ హత్య (Murder )కు గురికావడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లి (75), కుమార్తె (45)ను దుండగులు హత్య చేసి పారిపోయారు. జఫర్‌గఢ్‌ మండలం తుమ్మడపల్లి ఐ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆస్తి తగాదాలతోనే ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది....
Detect heart failure | ఇక క్షణాల్లో గుండె వైఫ‌ల్యాన్ని ప‌సిగ‌ట్టొచ్చు..
LifeStyle, Technology

Detect heart failure | ఇక క్షణాల్లో గుండె వైఫ‌ల్యాన్ని ప‌సిగ‌ట్టొచ్చు..

Detect heart failure : గుండె వైఫల్యం (Heart Failure)ను క్ష‌ణాల్లోనే ముందుగా ప‌సిగ‌ట్టే ప‌రిక‌రం భార‌త‌దేశంలో అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడ‌ల్ దేశంలోనే మొట్టమొదటి అద్భుతమైన వైద్య ఆవిష్కరణగా నిలిచింది. దీనిని నారాయ‌ణ హెల్త్ (Narayana Health) క్లినికల్ రిసెర్చ్ టీం, మేధా ఏఐ (Medha AI) అనే అడ్వాన్స్ ఎన‌లైటిక్స్ అండ్ ఏఐ (Advanced Analytics & AI) విభాగం సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ECG చిత్రాల ఆధారంగా గుండె పనితీరును ముందే అంచనా వేసేలా దీన్ని రూపొందించారు. Detect heart failure : గ్రామీణ ప్రాంతాలకు పెద్ద వరం ఇది వనరులు తక్కువగా ఉన్న గ్రామీణ‌ ప్రాంతాల్లో చాలా ఉపయోగపడే ఆవిష్కరణ. మారుమూల ప్రాంతాల్లో చాలామంది రోగులకు గుండె సమస్యలు ఉన్నా అవసరమైన పరీక్షలు తీసుకునే అవకాశం ఉండదు. ముఖ్యంగా "ఇకో" (Echocardiography), గుండె పనితీరును అంచనా వేయడంలో ప్రాముఖ్యత గల పరీక్ష...
South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు
Hyderabad, State

South Central Railway | సికింద్రాబాద్‌, చ‌ర్ల‌ప‌ల్లి నుంచి ప్ర‌త్యేక రైళ్లు

South Central Railway : ప్రయాణికులకు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే శుభ‌వార్త చెప్పింది. సికింద్రాబాద్ నుంచి మైసూరు (Secunderabad–Mysuru), అలాగే చ‌ర్ల‌ప‌ల్లి నుంచి కాకినాడ టౌన్ (Charlapalli–Kakinada Town) మార్గాల్లో ప్రత్యేక రైళ్ల‌ను న‌డిపిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. రైలు ప్రయాణికుల సంఖ్య ఈ మధ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway - SCR) ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రత్యేక రైళ్లు ఆగస్టులోనే ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. వీటిలో ఏసీ (AC), స్లీపర్ (Sleeper), జనరల్ (General) తరగతి కోచ్‌లు ఉండటంతో అన్ని తరగతుల ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందని రైల్వే అధికారులు వెల్లడించారు. సికింద్రాబాద్ – మైసూరు మధ్య ప్రత్యేక రైళ్లు ఈ మార్గంలో నడిచే ప్రత్యేక రైళ్ల నంబర్లు 07033 / 07034. ఇవి ఆగస్టు 8 నుంచి 30వ తేదీ వరకు న‌డ‌వ‌నున్నాయి. మొత్తం ఎనిమిది స...
India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు
National

India Census | దేశంలో జనాభా గణన తేదీలు ఖరారు

India Census 2026 | భారతదేశంలో తదుపరి జనాభా గణన రెండు దశల్లో నిర్వహించబడుతుందని కేంద్ర‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇది అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభమై మార్చి 1, 2027 వరకు కొనసాగుతుంది.లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్‌లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలలో జనాభా గణన 2026 అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది. అలాగే దేశంలోని మిగిలిన ప్రాంతాలలో 2027 మార్చి 1 నుండి చేపట్టనున్నారు. ఈరోజు హోం మంత్రిత్వ శాఖ (Ministry of Home Affairs) జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా దీనిని ప్రకటించారు. భారతదేశ 16వ జనాభా లెక్కల అధికారిక నోటిఫికేషన్‌ను భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ కార్యాలయం ద్వారా హోం మంత్రిత్వ శాఖ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం, దేశంలోని చాలా ప్రాంతాలకు మార్చి 1, 2027న 00:00 గంటలుగా ఉంటుంది. అయితే, కఠినమైన వాతావరణ పరిస్థితులు, క్లిష్ట భూభాగం కారణంగా, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ...
Modi Visit | అమ‌రావ‌తికి పీఎం మోదీ.. రాజ‌ధాని ప‌నుల‌కు శ్రీ‌కారం
State

Modi Visit | అమ‌రావ‌తికి పీఎం మోదీ.. రాజ‌ధాని ప‌నుల‌కు శ్రీ‌కారం

Modi Visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమరావతి (Amaravati)లో పర్యటించనున్నారు. రాజధాని పనుల (capital city's construction works) పునఃప్రారంభానికి మే 2న ఆయన రానున్నారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం (state government) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ (Minister P. Narayana) ఈ రోజు అమరావతిలో పర్యటించారు. మోదీ టూర్‌కు సంబంధించిన‌ ఏర్పాట్లను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్, కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్, సంయుక్త కలెక్టర్ భార్గవ్ తేజ్ తదితరుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. Modi Visit : రాజధాని పనులకు ఊతం రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ప‌ర్య‌ట‌న ప్ర‌తిష్టాత్మ‌కం (prestigious)గా మారింది. ఆయ‌న రాక‌తో రాజధాని నిర్మాణానికి (capital city's cons...
error: Content is protected !!