Sarkar Live

Author: Maulika

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు
National, World

Amir of Qatar visit | హైద‌రాబాద్ భ‌వ‌న్‌లో ఖ‌తార్ అధ్య‌క్షుడు, మోదీ.. కీల‌క ఒప్పందాలు

Amir of Qatar visit : ఖతార్ అమీర్ (అధ్య‌క్షుడు) తమీమ్ బిన్ హమాద్ అల్-థానీ (Qatar Amir Tamim Bin Hamad Al-Thani)తో భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీ సంద‌ర్భంగా ప‌లు ఒప్పందాలు జ‌రిగాయి. భారత్-ఖతార్ ద్వైపాక్షిక సంబంధాల‌ను మ‌రింత ప‌టిష్ట ప‌ర్చేలా కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగాయి. Amir of Qatar visit : స్వ‌యంగా స్వాగ‌తం ప‌లికిన మోదీ ఈ సమావేశానికి ముందు ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్‌లో గౌర‌వ వంద‌నం ల‌భించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. సాధారణంగా విదేశీ నేతలను స్వాగతించడం కోసం ప్రొటోకాల్‌ ప్రకారం ముఖ్యమైన అధికారులు లేదా మంత్రులు విమానాశ్రయంలో స్వాగతం పలుకుతారు. అయితే.. ఈసారి ప్రధాని మోదీ స్వయంగా ఖతార్ అమీర్‌ను స్వాగతించడానికి విమానాశ్రయానికి వెళ్లారు. తన సోదరుడికి స్వాగతం పలుకుతున్నానని, ఆయన భారత ప...
Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌
Trending

Mechanical Elephants | ఇక ఉత్స‌వాల్లో కృత్రిమ ఏనుగులు.. PETA ప్ర‌తిపాద‌న‌

Mechanical Elephants : కేరళ (Kerala)లో ఇటీవల ఏనుగు దాడులు పెరిగాయి. దీంతో అనే మంది ప్రాణాల‌ను కోల్పోయారు. చాలామంది గాయ‌ప‌డ్డారు. ఆలయాలు, ప్రార్థ‌న స్థ‌లాల్లో జ‌రిగే పండుగ‌ల సమయంలో ఈ దుర్ఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (PETA) ఇండియా అనే జంతు హక్కుల సంస్థ ఒక ప్రత్యేక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నిజ‌మైన ఏనుగుల్లా Mechanical Elephants ఉత్స‌వాల్లో ఏనుగుల‌ను వినియోగించ‌డం వల్ల శారీర‌క‌, మాన‌సిక ఒత్తిడి పెరిగి అవి విచ‌క్ష‌ణ కోల్పోయి హింసాత్మ‌కంగా మారుతున్నాయ‌ని PETA అంటోంది. వాటి స్థానంలో కృత్రిమ ఏనుగుల‌ను వినియోగించాల‌ని కోరింది. అచ్చం అస‌లైన ఏనుగుల్లా జీవం ఉట్టిప‌డే విధంగా ఇవి ఉంటాయ‌ని తెలిపింది. ఈ యాంత్రిక (కృత్రిమ‌) ఏనుగుల‌ను తాము స‌మ‌కూర్చేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని PETA అంటోంది. అయితే.. దానికి ఒక ష‌ర‌తు విధించింది. ఉత్స‌వాల‌కు వి...
FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..
National

FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..

FASTag New Rules : జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఫాస్టాగ్ వ్యవస్థను ప్ర‌వేశ‌పెట్టిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఓ రూల్‌ను తీసుకొచ్చింది. ఫాస్టాగ్ (FASTag) బ్లాక్ లిస్టులోకి వెళ్లినప్పుడు వినియోగ‌దారులు రెట్టింపు చార్జ‌లు చెల్లించాలని నిబంధ‌న‌ను విధించింది. ఇది ఈరోజు (2025 ఫిబ్ర‌వ‌రి 17) నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. FASTag New Rules 2025 : పాటించ‌కుంటే డ‌బుల్‌ వ‌డ్డింపు సాధార‌ణంగా తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయకపోవడం, లేదా వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. తద్వారా టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద చెల్లింపులు జ‌ర‌గ‌వు. NPCI తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. బ్లాక్ లిస్టులోకి వెళ్లిన వినియోగదారులు 70 నిమిషాల వ్యవధిలో త‌మ ఫ...
AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..
career

AP CETs 2025 Schedule | ఏపీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఎప్పుడంటే..

AP CETs 2025 Schedule | ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసింది. వివిధ కోర్సులలో ప్రవేశానికి పరీక్షలు మే 2 నుంచి జూన్ 25 వరకు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ రంగానికి చెందిన కోర్సులకు సంబంధించి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ 2025 పరీక్ష మే 19 నుంచి ఆన్‌లైన్‌లో జ‌ర‌గ‌నుంది. AP CETs 2025 Schedule : పూర్తి వివ‌రాలు ఇవే.. పీహెచ్‌డీ కోర్సులకు ఏపీఆర్‌ సెట్‌ (APRSET) మే 2 నుంచి మే 5 వరకు. మే 6న‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా లేటరల్ ఎంట్రీకి ఏపీ ఈసెట్‌ (AP ECET) మే 7న ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఏపీ ఐసెట్‌ (AP ICET) మే 19 నుంచి 20 వ‌ర‌కు వ్యవసాయం, ఫార్మసీ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 21 నుంచి 27 వ‌ర‌కు ఇంజినీరింగ్ కోర్సులకు ఏపీ ఈఏపీ సెట్‌ (AP EAPCET) మే 25న ఏపీ లా సెట్...
US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు
World

US tariff hike | నో టెన్ష‌న్‌.. టారిఫ్‌ల ప్ర‌భావం తక్కువే.. : విశ్లేష‌కులు

US tariff hike | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌క‌టించిన ప‌ర‌స్ప‌ర సుంకాల (టారిఫ్‌) నిర్ణ‌యం భారత ఆటోమోటివ్ పరిశ్రమ (Indian automotive manufacturers)పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదంటున్నారు విశ్లేష‌కులు. భారతీయ వాహన తయారీదారులు ప్రధానంగా దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడుతుంటార‌ని, అమెరికా టారిఫ్‌లు ఎక్కువైనా ప్ర‌భావం (impact) అంతంత మాత్ర‌మే ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. US tariff hike ప్ర‌భావం ఎందుకు ఉండ‌దంటే.. మూల భాగాల స్థానికీకరణ, దేశీయ అమ్మకాలు ఎక్కువగా ఉండటం, అమెరికాకు ఎగుమతులు తక్కువగా ఉండటం వల్ల వాహన తయారీదారులు ఈ టారిఫ్‌ల‌తో పెద్ద‌గా న‌ష్ట‌పోయేదేం లేదంటున్నారు ఎస్ అండ్ పీ గ్లోబల్ మొబిలిటీ ఇండియా, ఏషియ‌న్ డైరెక్టర్ పునీత్ గుప్తా (Puneet Gupta). అయితే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) వంటి కంపెనీలు ఈ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉందని విశ్లేష‌కులు అంటున్నారు. ఇది ఐచర్ మ...
error: Content is protected !!