Startups | స్టార్టప్‌లకు భారీ పెట్టుబడులు.. వారం రోజుల్లో 2 వేల కోట్లు
Startups in India | భారతదేశంలో స్టార్టప్‌లకు మంచి రోజులు వచ్చాయి. వీటిలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రధాన కంపెనీలు సైతం అమితాసక్తి చూపుతున్నాయి. గత వారం సమకూరిన నిధులే ఇందుకు నిదర్శనం. మొత్తం 30 స్టార్టప్‌లు కలిపి 240.85 మిలియన్ డాలర్లు (సుమారు 2000 కోట్లు) సమీకరించాయని నివేదికలు చెబుతున్నాయి. వీటిలో ఐదు గ్రోత్-స్టేజ్ పెట్టుబడులు కాగా 20 ఎర్లీ-స్టేజ్ రౌండ్లు ఉన్నాయి. ప్రధానంగా బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, చెన్నై, పాట్నా వంటి నగరాల్లో ఈ పెట్టుబడులు సమకూరాయి.
ముందంజలో బెంగళూరు
స్టార్టప్ నిధుల సేకరణలో బెంగళూరు (Bengalur) మరోసారి ముందంజలో ఉంది. గత వారం మొత్తం 12 ఒప్పందాలు ఈ నగరంలో కుదిరాయి. ఇక్కడి స్టార్టప్‌లకు పెట్టుబడిదారుల నుంచి ఎక్కువ ప్రాధాన్యం లభించడానికి పలు కారణాలున్నాయి. బెంగళూరును భారతదేశ ఐటీ, స్టార్టప్ హబ్‌గా పిలుస్తారు. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు, యూనికార్న...




