UPI contribution | భారత్‌లో యూపీఐ విప్లవం.. 83 శాతం పెరిగిన చెల్లింపులు
                    UPI contribution : భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) విప్లవాత్మక వృద్ధి చెందుతోంది. డిజిటల్ పేమెంట్స్‌లో 2019లో 34 శాతం ఉన్న యూపీఐ వాటా గణనీయంగా పెరుగుతోంది. 2024 నాటికి ఇది 83 శాతానికి చేరుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో యూపీఐ 74 శాతం వృద్ధి రేటుతో (CAGR - క్యూమ్యులేటివ్ యావరేజ్ గ్రోత్ రేట్) అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ఈ విషయం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పేమెంట్ సిస్టం రిపోర్టు ద్వారా వెల్లడైంది.
తగ్గుముఖం పట్టిన ఇతర చెల్లింపులు
ఇతర చెల్లింపు వ్యవస్థలైన RTGS, NEFT, IMPS, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు వంటి వాటి వాటా మాత్రం ఐదేళ్లకాలంలో 66 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. ఇది యూపీఐ పాయింట్‌ను మరింత స్పష్టంగా చూపుతోంది. యూపీఐ వల్లనే భారతదేశం డిజిటల్ చెల్లింపుల విభాగంలో ముందు వరుసలో నిలిచిందని నివేదికలో పేర్కొన్నారు.
సులువైన పద్ధత...                
                
             
								



