Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన
ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు
Ayyappa Devotees Protest : శబరిమల యాత్రకు బయల్దేరిన అయ్యప్ప భక్తులు (Ayyappa Devotees) హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) వద్ద ఈ రోజు ఆందోళన (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం రద్దు కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. షెడ్యూల్ ప్రకారం గురువారం సాయంత్రమే బయల్దేరాల్సిన విమానం రద్దు అయ్యింది. దీంతో అయ్యప్ప భక్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు.
స్పష్టత ఇవ్వని అధికారులు
శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్రవారం వరకు కూడా విమానం బయల్దేరకపోవడం అయ్యప్ప (ayyappa) భక్తుల అసహనానికి కారణమైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వకపోవడంతో నిరసనకు దిగారు. మకర జ్యోతి సమయంలో శబరిమలల...




