Ram Gopal Varma | ఈసారైనా రావయ్యా.. ఆర్జీవీకి పోలీసుల మరో నోటీసు
Hyderabad : సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ప్రకాశం జిల్లా పోలీసులు మరోసారి నోటీసు జారీ చేశారు. 2024 నవంబర్ 10న మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైన నేపథ్యంలో విచారణకు హాజరుకావాలని పిలిచారు. అయితే.. విచారణకు హాజరు కావాలని పలుమార్లు నోటీసులు పంపినా వర్మ వివిధ కారణాలు చూపుతూ హాజరు కాలేదు. తాజాగా పోలీసులు మరోసారి నోటీసు పంపారు. ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ బాబు ఆయనకు వాట్సాప్ మెస్సేజ్ ద్వారా దానిని పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. దీనిపై వర్మ రిప్లయ్ ఇస్తూ ఫిబ్రవరి 4న షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, 7న విచారణకు వస్తానని తెలిపారు.
Ram Gopal Varma పై నమోదైన కేసు ఏమిటి?
వర్మ తన 'వ్యూహం' సినిమా ప్రమోషన్‌లో భాగంగా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh)ల ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట...




