iBomma : కరేబియన్ దీవుల నుంచి ఐబొమ్మ వెబ్‌పోర్టల్ నిర్వహణ
పైరసీ కేసులో ఐబొమ్మ వ్యవస్థాపకుడు ఇమ్మడి రవి అరెస్టు
iBomma గురించి తెలయని సినీ ప్రేమికులు ఉండరు. కొత్తగా విడుదలైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ఈ iBomma వెబ్‌సైట్ అక్రమంగా అప్‌లోడ్ చేస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నిర్మాతలు, దర్శకులు, పరిశ్రమకు సంబంధించిన సంఘాలు అనేకమార్లు ఫిర్యాదులు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా దీని నిర్వాహకులెవరు.. ఎక్కడ ఉంటారు? అనేది తెలియరాలేదు. చివరకు తెలంగాణ పోలీసులు దీని iBomma ఆటకట్టించారు. ఈ వెబ్‌సైట్ నిర్వాహుడిని కటకటాల వెనక్కి పంపారు.
iBomma నిర్వాహుడు (iBomma administrator) ఇమ్మడి రవి (Imaddi Ravi)గా గుర్తించారు. నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అతడిని సీసీఎస్ (Hyderabad CCS police) పోలీసులు కూకట్‌పల్లిలో అరెస్టు చేశారు. చాలా కాలంగా కరీబియన్ దీవుల్లో నివసిస్తున్న రవి అక్కడ నుంచే ఈ ఆపరేషన్‌ను నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తి...




