Warangal Rains | భారీ వర్షంతో వరంగల్ అతలాకుతలం
                    జిల్లాలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం
మానుకోట, డోర్నకల్, వరంగల్ రైల్వే స్టేషన్లలో నీటమునిగిన రైలు పట్టాలు 
ఎక్కడికక్కడే నిలిచిపోయి పలు రైళ్లు..  మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు
Warangal Rains | తుపాను మొంథా ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. హన్మకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో అతిభారీ వర్షాలు నమోదయ్యాయి. వరంగల్ జిల్లా కల్లెడలో అత్యధికంగా 34 సెంటీమీటర్ల వర్షంపాతం నమోదు కాగా, ఆ తర్వాత వరంగల్ జిల్లా కాపులకనపర్తిలో 25.23, రెడ్లవాడలో 24.63, సంగెంలో 23.48, వర్ధన్నపేటలో 22.8, సెంటీమీటర్ల వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లిలో 21.8, జనగామ జిల్లా గూడురులో 23.58, మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తిలో 19.23, కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 17.58, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 16.45, యాదాద్రి జిల్లా ఆత్మకూరులో 16.23 సెంటీమీటర్ల వర్...                
                
             
								



