Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
PM Modi US visit | అమెరికాలో మోదీ.. కీల‌క ఒప్పందాలు
World

PM Modi US visit | అమెరికాలో మోదీ.. కీల‌క ఒప్పందాలు

PM Modi US visit : ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అమెరికాలో ప‌ర్య‌టిస్తున్నారు. నిన్న (బుధ‌వారం) వాషింగ్ట‌న్ డీసీ (Washington DC)కి చేరుకున్న ఆయ‌న అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ (Tulsi Gabbard)తో భేటీ అయ్యారు. భారత్-అమెరికా మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశాలపై వారిద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ పర్యటనకు ముందు ఫ్రాన్స్‌లో రెండు రోజుల పర్యటనను ముగించారు. అక్కడి నుండి నేరుగా అమెరికాకు (PM Modi US visit) చేరుకున్నారు. వాషింగ్టన్ డీసీలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు మోదీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కీల‌కాంశాలపై ఒప్పందాలు డొనాల్డ్ ట్రంప్ (President Donald Trump) అమెరికా అధ్య‌క్షుడిగా రెండోసారి బాధ్య‌తలు స్వీక‌రించిన త‌ర్వాత ప్ర‌ధాని మోదీ ఆ దేశంలో తొలిసారిగా ప‌ర్య‌టిస్తున్నారు. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయ...
Pushpak Bus | ప్రయాణికులకు గుడ్ న్యూస్..  అందుబాటులోకి మరిన్ని పుష్పక్‌ సర్వీసులు
State

Pushpak Bus | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి మరిన్ని పుష్పక్‌ సర్వీసులు

Hyderabad | శంషాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు (Shamshabad Airport) కు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభ‌వార్త చెప్పింది. డిమాండ్ ను బ‌ట్టి మ‌రిన్ని పుష్పక్‌ సర్వీసులను(Pushpak Bus Services ) పెంచ‌నున‌ట్లు ఆర్టీసీ(TGSRTC) అధికారులు ప్ర‌క‌టించారు. ఇప్పటికే కొన్ని బస్సులు సర్వీసులు న‌డుస్తుండ‌గా మరో 6 సర్వీసులు ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఈ బస్సులు సికింద్రాబాద్‌ జేబీఎస్‌ నుంచి రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు మీదుగా ప్ర‌యాణికుల‌కు సేవ‌లందిస్తాయి. ఈ బస్సులు మొత్తం 24 ట్రిప్పులు (Pushpak Bus ) నడుస్తున్నాయి. Pushpak Bus టైమింగ్స్‌.. హాల్టింగ్ స్టేజీలు Pushpak Bus Timings : సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, రాణిగంజ్‌, సెక్రటేరియట్‌, రవీంద్రభారతి, హజ్‌హౌస్‌, నాంపల్లి, గాంధీభవన్‌(Gandhi Bhavan), ఎంజే మార్కెట్‌, అఫ్జల్‌గంజ్‌, బహదూర్‌పుర, ఆరాంఘర్ వ‌ద్ద హాల్టింగ్‌ల‌తో శంషాబాద్...
Caste Survey | మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే.. వివ‌రాలు ఇవ్వ‌నివారు ఇవ్వొచ్చు..
State

Caste Survey | మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే.. వివ‌రాలు ఇవ్వ‌నివారు ఇవ్వొచ్చు..

Caste Survey in Telangana : రాష్ట్రంలో మ‌రోసారి కుల‌గ‌ణ‌న స‌ర్వే వివరాల నమోదుకు అవకాశం క‌ల్పిస్తున్న‌ట్లు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Bhatti Vikramarka ) వెల్ల‌డించారు. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు. మూడు పద్ధతుల్లో ఇప్పటివరకు నమోదు చేసుకొని వారికి అవకాశం కల్పిస్తున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్క‌ర్ సచివాలయంలో సమగ్ర ఇంటింటి సర్వే పై జరిగిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్రంలో కుల గణన (Caste Survey) విజయవంతమైతే దేశమంతా చేయాల్సి వ‌స్తుంది భావించేవారు రీసర్వే కోరుతున్నారని ఆరోపించారు. బీసీల‌కు 42శాతం రిజ‌ర్వేష‌న్ బీసీల దశాబ్దాల కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం (Congress Govt)తో రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కలిసి రావాల‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌ పిలుపునిచ్చారు.. రాష్ట్రంలో ఓబీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన...
Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు
National

Freebies | ఉచితాల వ‌ల్ల ప్ర‌జ‌లు ప‌నిచేయ‌డం మానేస్తారు.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్య‌లు

New Delhi : ఎన్నికలకు ముందు " ఉచిత బహుమతులు (Freebies ) " ప్రకటించే పార్టీలపై భారత సుప్రీంకోర్టు బుధవారం తీవ్రంగా మండిపడింది . ఇటువంటి పథకాలు తరచుగా ప్రజలను పని చేయకుండా చేస్తాయ‌ని, దేశ అభివృద్ధిలో భాగ‌స్వాములు కాకుండా అడ్డుకుంటాయ‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉచితాలను ప్రకటించే పద్ధతిని సుప్రీంకోర్టు ఖండిస్తూ, ఉచిత రేషన్, డబ్బు లభిస్తున్నందున ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదని పేర్కొంది. నైట్ షెల్టర్లకు సంబంధించిన కేసును విచారిస్తూ జస్టిస్ బిఆర్ గవై, అగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం చేసిన తాజా వ్యాఖ్యలు అంద‌రిన్నీ ఆలోచింప‌జేస్తున్నాయి."దురదృష్టవశాత్తు, ఈ ఉచితాల కారణంగా… ప్రజలు పని చేయడానికి ఇష్టపడటం లేదు. వారికి ఉచిత రేషన్లు అందుతున్నాయి. వారు ఎటువంటి పని చేయకుండానే న‌గ‌దు పొందుతున్నారు" అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. Freebies తో ప‌రాన్న జీవుల‌ను సృష్టిస్తున్నా...
Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు
State

Medaram 2025 | మేడారం మినీ జాత‌ర ప్రారంభం.. భారీగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు

Medaram Mini Jatara 2025 : ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మ (Medaram Sammakka Saralamma ) మినీ జాతర అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. నేటి నుంచి నాలుగు రోజుల‌పాటు ఈ వేడుక కొన‌సాగ‌నుంది. రెండేళ్ల‌కోసారి మ‌హాజాత‌ర జ‌రుగుతుండ‌గా మ‌ధ్య‌లో ఈ చిన్న జాత‌ర‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ. గత ఏడాది మహాజాతర జరిగింది. మ‌ళ్లీ 2026లో నిర్వ‌హించ‌నున్నారు. మినీ జాతర ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు జరుగుతుంది. గిరిజన సంప్రదాయం ప్రకారం మండమెలిగే పండుగతో మినీ జాతర ప్రారంభమైంది. మినీ జాతర చరిత్ర పూర్వం మేడారం, కన్నెపల్లిలో సమ్మక్క, సారలమ్మ ఆలయాల స్థానంలో గుడిసెలు ఉండేవి. మాఘ శుద్ధ పౌర్ణమికి వారం రోజుల ముందు వచ్చే బుధవారం గిరిజనులు (Koya community) పాత గుడిసెలను తొలగించి, కొత్త వాటిని నిర్మించి భక్తి శ్రద్ధలతో మండమెలిగే పండుగను నిర్వహించేవారు. ఆ తర్వాత పౌర్ణమికి మహాజాతర నిర్వహించడం ...
error: Content is protected !!