Cancer Vaccine | ఎన్నాళ్లకెన్నాళ్లకు.. క్యాన్సర్ రోగులకు భారీ ఊరట! రష్యా కొత్త వ్యాక్సిన్ వస్తోంది..
Cancer Vaccine : క్యాన్సర్ వ్యాక్సిన్ మార్కెట్‌లోకి త్వరలో రానుంది. రష్యా దీన్ని రూపొందించింది. కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఈ వ్యాక్సిన్‌ను లాంచ్ చేయనుంది. ఈ మేరకకు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) సంకేతాలు ఇచ్చారు. తమ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోందని, ఇది తుది దశకు చేరుకుందని ఆయన ప్రకటించారు.
ఆ తర్వాతే అంతర్జాతీయ మార్కెట్‌లోకి..
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. ఇది వేగంగా విస్తరిస్తోంది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారిని కంట్రోల్ చేయడం తప్ప దీని బారి నుంచి బయట పడానికి కచ్చితమైన చికిత్స లేదు. అయితే.. ఈ విషయంలో రష్యా పురోగతిని సాధించింది. క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ఆ వ్యాధిగ్రస్థులకు అందుబాటులోకి తెస్తోంది. ఈ వ్యాక్సిన్ రోగులకు చికిత్స అందించడానికే ఉపయోగపడుతుందన...




