Kodangal | సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో రోడ్డెక్కిన విద్యార్థులు..
Kodangal : ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల వంటి రుచిపచీ లేని సాంబారు, ఒక్కపూట మాత్రమే అన్నం వడ్డింపు.. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సొంత నియోజకవర్గంలో విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం తీరు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోస్గి మండలం చెన్నారం పాఠశాలలో ఉడకని అన్నం నీళ్లలాంటి సాంబారు పెడుతున్నారని, అన్నం ఒక్కపూట మాత్రమే వడ్డిస్తున్నారని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. అలాగే గుడ్డు (Egg), అరటిపండు నెలలో ఒక్కసారి మాత్రమే పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయంపై పిల్లల తల్లిదండ్రులు పలుమార్లు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని చెబుతున్నారు. ఈమేరకు గురువారం పాఠశాలలో భోజనం పెట్టకపోవడంతో ఆగ్రహించి పాఠశాల ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన (Students Protest) తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు, వంట నిర్వాహకులను వెంటనే మార్చాలని విద్...




