Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
KCR : కేసీఆర్ ఎక్కడ..?
Special Stories

KCR : కేసీఆర్ ఎక్కడ..?

యావత్ తెలంగాణ ప్రజల మదిని తొలుస్తున్న ప్రశ్న? కేసిఆర్ బయటికొస్తే పూర్వవైభవం అంటున్న గులాబీ కేడర్ కాంగ్రెస్ అధికారంలోకి రావడం జీర్ణించుకోలేకపోతున్నారంటున్న కాంగ్రెస్.. వ్యూహాలు రచిస్తున్నారా… జీర్ణించుకోలేకనే బయటకు రావట్లేదా? Telangana : తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూది.. ఆమరణ దీక్షతో చావు దాకా వెళ్లి.. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన అపర చాణక్యుడు కేసీఆర్ (KCR ) కొంత కాలంగా ఎందుకు కనిపించడం లేదు..? దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో కేసీఆర్ ఏది మాట్లాడినా సంచలనమే, ఆయన మాట్లాడక‌పోవ‌డ‌మూ ఇప్పుడ సంచ‌ల‌న‌మే.. ఆయన మౌనమే ఓ భారీ వ్యూహాన్ని త‌లపిస్తోంది. ప్ర‌స్తుతం తెలంగాణలో రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంటే.. ఆయన ఎందుకు మిన్న‌కుండిపోతున్నారు? తెలంగాణ జాతి పిత‌గా పేరొందిన వ్యక్తి.. ఇప్పుడెందుకిలా మౌనమునిగా మారిపోయారు. బీఆర్‌ఎస్‌ (BRS Party) అధినేత కేసీఆర్‌ (KCR) గురించి.. పార్టీ వర్గాల్ల...
Davos : డావోస్‌లో చంద్ర‌బాబు.. వ్యాపార దిగ్గ‌జాల‌తో భేటీ
State

Davos : డావోస్‌లో చంద్ర‌బాబు.. వ్యాపార దిగ్గ‌జాల‌తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి (Andhra Pradesh Chief Minister) చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్‌లోని డావోస్ (Davos)లో ప‌ర్య‌టిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Microsoft founder Bill Gates)తో పాటు అనేక మంది అంత‌ర్జాతీయ కార్పొరేట్ అధిపతులతో ఈ రోజు చంద్ర‌బాబు నాయుడు ( N Chandrababu Naidu) సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల‌ను ఆకర్షిస్తూ త‌ద్వారా అనేక ప్రాజెక్టుల‌ను స్థాపించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశ‌గా వీరి మ‌ధ్య చ‌ర్చ‌లు, ఒప్పందాలు జ‌రిగాయి. చంద్ర‌బాబు Davos ప‌ర్య‌ట‌న.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కీల‌కం స్విస్ రిసార్ట్ టౌన్‌లో చంద్రబాబు నాయుడు ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఈ భేటీ కీల‌కం కానుంది. యునిలీవర్, డీపీ వరల్డ్ గ్రూప్, పెట్రోనాస్, గూగుల్ క్లౌడ్, పెప్సి, ఆస్ట్రాజెనెకా వంటి కంపెనీల అధిపతులతో సమావేశమై రాష్ట్ర...
Ram Charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే…?
Cinema

Ram Charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janvi Kapur)జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchi babu) దర్శకుడుగా రూపొందుతున్న మూవీ కి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు దర్శకుడి గా మారి వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన మూవీని తెరకెక్కించారు. మొదటి మూవీతోనే సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ వచ్చి 4 సంవత్సరాలు అయినా రామ్ చరణ్ తో మూవీ చేయడానికి వెయిట్ చేశాడు. రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో మూవీ గేమ్ చెంజర్ అయిపోయాక ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యాడు. గేమ్ చేంజర్ బడ్జెట్ 450 కోట్లు పెట్టిన వసూళ్లు మాత్రం 200 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కొందరు ఆడియన్స్ ఈ మూవీని డిజాస్టర్ అని తేల్చేశారు. కొందరు అభిమానులు మాత్రం మూవీ బాగుందని దీనికంటే డాకు ...
Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!
National

Chhattisgarh : భారీ ఎన్‌కౌంట‌ర్‌.. 20 మంది మావోయిస్టులు హతం!

ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దు (Chhattisgarh -Odisha border)లో జరిగిన ఎదురుకాల్పుల్లో (Encounter) 20 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పులు జనవరి 19 రాత్రి నుంచి ప్రారంభమై రెండు రోజుల‌పాటు కొన‌సాగాయి. మావోయిస్టులు (Maoists) ఉన్నార‌నే స‌మాచారాన్ని ఇంటెలిజెన్స్ ద్వారా అందుకున్న భ‌ద్ర‌తా ద‌ళాలు ఈ ఆప‌రేష‌న్‌ను ప్రారంభించాయి. ఛత్తీస్‌గఢ్ జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), కోబ్రా దళాలు, ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG) కలిసి అమలు చేశాయి. మృతుల్లో కేంద్ర క‌మిటీ స‌భ్యుడు ఎన్‌కౌంట‌ర్‌ (Chhattisgarh Encounter )లో హతమైన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళ‌లు కూడా ఉన్నారు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర క‌మిటీ స‌భ్యుడు జైరాం అలియాస్ చల‌ప‌తి కూడా ఉన్న‌ట్టు గారియాబంద్ జిల్లా ఎస్పీ నిఖిల్ రాకేచా తెలిపారు. అత‌డిపై రూ. 1 కోటి రివార్డు ఉంద‌ని చెప్పారు. మిగతా మృతుల వివరాలను ఇంకా...
Fake Currency : హుండీలో భారీగా న‌కిలీ నోట్లు.. ఆల‌య క‌మిటీ షాక్‌
State

Fake Currency : హుండీలో భారీగా న‌కిలీ నోట్లు.. ఆల‌య క‌మిటీ షాక్‌

Fake Currency in Hundi : ఓ భ‌క్తుడు అతి తెలివిని ప్ర‌ద‌ర్శించాడు. హుండీలో న‌కిలీ కరెన్సీ నోట్లు వేసి మొక్కులు తీర్చుకున్నాడు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) గాంధారి మండ‌లం (Gandhari mandal)లో ఈ ఘ‌టన చోటుచేసుకుంది. చాద్మ‌ల్ తండా ( Chadmal Thanda)లోని ల‌చ్చ‌మ్మ ఆల‌యంలో సంక్రాంతి వేడుక‌ల అనంత‌రం హుండీల‌ను తెరిచి భ‌క్తులు స‌మ‌ర్పించిన కానుక‌లు లెక్కిస్తుండ‌గా ఇది వెలుగులోకి వ‌చ్చింది. హుండీలో రూ. 500 న‌కిలీ నోట్ల (Fake Currency)ను ఆల‌య క‌మిటీ స‌భ్యులు క‌నుగొన్నారు. వీటిని లెక్కిస్తే రూ. కోటి ఉన్న‌ట్లు తేలింది. డ‌బ్బులు లెక్కిస్తుండ‌గా… గ్రామస్థులకు ల‌చ్చ‌మ్మ ఆలయ కమిటీ తక్కువ వడ్డీతో రుణాలు అందించే సంప్రదాయాన్ని పాటిస్తోంది. ఈ ప్రదేశంలో భక్తులు భక్తిపూర్వకంగా భారీగా విరాళాలు అందజేస్తారు. ఎప్ప‌టిలాగే ఆలయ హుండీ నుంచి సేకరించిన డబ్బును గ్రామస్థుల‌కు రుణంగా ఇచ్చారు. ఈ క్ర‌మంలో ప‌లువుర...
error: Content is protected !!